Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఠాగూర్ సినిమా రిపీట్.. చనిపోయిన మహిళకి వైద్యం

ఠాగూర్ సినిమా రిపీట్.. చనిపోయిన మహిళకి వైద్యం

నిపోయిన వ్యక్తికి ఐసీయూ లో ఉంచి చికిత్స అందిస్తున్నామంటూ నాలుగు లక్షల రూపాయలకు పైగా వసూలు చేసిన సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేపింది.

మేడిపల్లిలోని కాకతీయ ప్రైవేట్ ఆసుపత్రి నిర్వాహకుల తీరుపై మృతురాలి బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఠాగూర్ సినిమా సీన్‌ను తలపించేలా వ్యవహారం సాగింది. బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థన్ నారాయణపురం మండలానికి చెందిన శోభ (42) గుండెకు సంబంధించిన ఇబ్బందులతో ఈ నెల 20న మేడిపల్లిలోని కాకతీయ ఆస్పత్రికి తీసుకువచ్చారు. అక్కడ పరిశీలించిన డాక్టర్లు గుండె సమస్య తీవ్రంగా ఉందని వెంటనే స్టెంట్లు వేయాలని తెలిపారు. దీంతో కుటుంబసభ్యులు అడ్వాన్స్ గా 4 లక్షలు ఆస్పత్రికి చెల్లించామని చెల్లించారు. అయితే శనివారం మధ్యాహ్నం శోభ చనిపోయిందని వైద్యులు తెలపారు. దీంలో కుటుంబ సభ్యులు ఆగ్రహానికి గురయ్యారు.

చనిపోయిన శవానికి చికిత్స పేరుతో లక్షల రూపాయలు వసూలు చేసి చివరకు చనిపోయిందని తెలిపారని ఆందోళనకు దిగారు.స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న మేడిపల్లి పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న రోగిని చికిత్స నిమిత్తం రెండు రోజుల క్రితం కాకతీయ ఆసుపత్రిలో చేర్చారు. రోగి పరిస్థితి విషమంగా ఉందంటూ వైద్యులు వెంటనే ఐసీయూకి తరలించారు. అయితే, వైద్యుల నిర్లక్ష్యంతో రోగి అంతకు ముందే మరణించిన, రోగి మరణించిన విషయాన్ని దాచిపెట్టిన ఆసుపత్రి వర్గాలు ఇంకా శ్వాస ఆడుతోందని వెంటిలేటర్‌పై ఉంచి అత్యవసర చికిత్స అందిస్తున్నామని బంధువులను నమ్మించారు. మందుల పేరుతో ప్రతిరోజు డబ్బులను వసూలు చేశారని బాధిత బంధువులు, కుటుంబ సభ్యులు ఆరోపించారు.కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఆరోపణలు నిజం కాదు కాకతీయ ఆస్పత్రి వైద్యులు

గుండె సంబంధిత వ్యాధితో ఆసుపత్రికి రావడం జరిగిందని ఆమె ఆరోగ్యం పరిస్థితిని ప్రతి విషయాన్ని కుటుంబ సభ్యులు తెలియజేశామని,పరిస్థితి విషమించడంతో చనిపోయిందని తెలపడంతో కుటుంబ సభ్యులు కావాలని నిరాధారణ ఆరోపణలు చేస్తున్నారని వైద్యులు తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Mana Telangana Telugu