Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
'థింసా' నృత్యం.. ఆంధ్రప్రదేశ్‌కే గర్వకారణం: చంద్రబాబు

'థింసా' నృత్యం.. ఆంధ్రప్రదేశ్‌కే గర్వకారణం: చంద్రబాబు

మరావతి: భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం సందర్భంగా ఆడబిడ్డలు ప్రదర్శించిన థింసా నృత్యం రాష్ట్రానికే గర్వకారణమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.

13 వేల మందికిపైగా నృత్యం చేసి.. ప్రపంచ రికార్డు నెలకొల్పారని చెప్పారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఈ ప్రదర్శన మన సంప్రదాయాలు, భవిష్యత్ ఆకాంక్షలను చాటి చెప్పిందన్నారు. అద్భత ప్రదర్శన చేసిన మహిళలు, చిన్నారులు, వారి గురువులకు ధన్యవాదాలు తెలిపారు. మన వారసత్వం అభివృద్ధి పథంలో వెళ్లడమే నిజమైన 'వికాస్ భీ - విరాసత్ భీ' స్పేూర్తి అని అన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Mana Telangana Telugu