Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
టీ20 క్రికెట్‌లో అభిషేక్ శర్మ అరుదైన రికార్డు..

టీ20 క్రికెట్‌లో అభిషేక్ శర్మ అరుదైన రికార్డు..

న్యూఢిల్లీ: టీమిండియా స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ టీ20 క్రికెట్‌లో అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో భాగంగా బుధవారం చెస్టర్-లె-స్ట్రీట్‌లోని రివర్‌సైడ్ గ్రౌండ్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో అభిషేక్ శర్మ..

అతి తక్కువ బంతుల్లోనే 100 టీ20 సిక్సర్లు పూర్తి చేసి చరిత్ర పుటల్లోకి తన పేరును లిఖించుకున్నాడు. ఈ క్రమంలో వెస్టిండీస్ బ్యాటర్ ఎవిన్ లూయిస్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. అభిషేక్, ఈ మైలురాయిని చేరుకోవడానికి 785 బంతులు ఎదుర్కోగా.. ఎవిన్ లూయిస్‌కు 789 బంతులు ఆడాడు.

అలాగే, టీ20 అంతర్జాతీయ ఫార్మాట్‌లో 100 సిక్సర్లు బాదిన ఐదవ భారత బ్యాటర్‌గా కూడా అభిషేక్ నిలిచాడు. ఈ జాబితాలో 2024 టీ20 ప్రపంచ కప్ గెలిచిన కెప్టెన్ రోహిత్ శర్మ(205), సూర్యకుమార్ యాదవ్ (179), హార్దిక్ పాండ్యా (126), విరాట్ కోహ్లీ (124)లు అభిషేక్ కంటే ముందున్నారు.

ఇక, మ్యాచ్ విషయానికి వస్తే.. ఇంగ్లాండ్- భారత్ మధ్య జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ కు దిగిన టీమిండియా 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 189 పరుగులు చేసింది. ఓపెనర్ అభిషేక్ శర్మ 59 పరుగులు, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 68 పరుగులు, శివమ్ దూబే అజేయంగా 41 పరుగులతో రాణించారు. అనంతరం ఇంగ్లాండ్ జట్టు బ్యాటింగ్ కు దిగకముందే వర్షం పెరగడం.. ఆగకుండా కురవడంతో మ్యాచ్ ను రద్దు చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Mana Telangana Telugu