Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న డిప్యూటి సిఎం

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న డిప్యూటి సిఎం

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గురువారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న డిప్యూటి సిఎం భట్టి విక్రమార్కకు టిటిడి అధికారులు ఘనంగా స్వాగతం పలికారు.

అనంతరం ఆయన స్వామివారిని దర్శించుకుని, మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల దర్శనం అనంతరం భట్టి విక్రమార్క శ్రీకాళహస్తికి చేరుకున్నారు. శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంలో కొలువుదీరిన పరమశివుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఆయనకు వేదాశీర్వచనం అందించి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. కాగా, సినీ నటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్,- కావ్య రెడ్డి వివాహ వేడుకలో డిప్యూటి సిఎం భట్టి విక్రమార్క దంపతులు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Mana Telangana Telugu