Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఉమెన్స్ హాకీ వరల్డ్ కప్ విజేత అర్జెంటీనా

ఉమెన్స్ హాకీ వరల్డ్ కప్ విజేత అర్జెంటీనా

మెన్స్ హాకీ వరల్డ్ కప్ 2026ను అర్జెంటీనా కైవసం చేసుకుంది. ఆమ్‌స్టల్‌వీన్‌లోని వాగెనర్ స్టేడియంలో జరిగిన ప్రపంచ కప్ ఫైనల్‌లో ప్రపంచ నంబర్ 1, వరుసగా మూడుసార్లు విజేతగా నిలిచిన నెదర్లాండ్స్ జట్టును ఓడించి, అర్జెంటీనా మూడవసారి టైటిల్‌ను కైవసం చేసుకుంది.

ఉత్కంఠభరితంగా జరిగిన ఈ పోరులో.. నిర్ణీత 60 నిమిషాల ఆట ముగిసే సమయానికి స్కోరు 1-1తో సమంగా నిలిచింది. ఆ తర్వాత జరిగిన షూట్-అవుట్‌లో 3-1 తేడాతో నెదర్లాండ్స్ పై అర్జెంటీనా సూపర్ విక్టరీ సాధించి ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించింది. ఈ సంచలన విజయంలో కీలక పాత్ర పోషించిన అర్జెంటీనా గోల్‌కీపర్ క్రిస్టినా కోసెంటీనో 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'గా ఎంపికయ్యారు. కాగా, ఉమెన్స్ హాకీ వరల్డ్ లో నెదర్లాండ్స్ తొమ్మిదిసార్లు కప్ సాధించగా.. అర్జెంటీనా మూడుసార్లు విజేతగా నిలిచింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Mana Telangana Telugu