మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ఆర్థిక ప్ర గతిని పరుగులు పెట్టించేలా, బడ్జెట్ అవసరాల కు అనుగుణంగా అదనపు ఆదాయ వనరుల ను సమకూర్చుకోవడంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి, లక్ష్యాలకు తగ్గట్లుగా ఆదాయం రాబట్టాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు.
శనివారం రాష్ట్ర సచివాలయంలో ఆయన అధ్యక్షతన ఆ దాయ వనరుల సమీకరణ మంత్రివర్గ ఉప సం ఘం (రిసోర్స్ మొబిలైజేషన్ క్యాబినెట్ సబ్ కమిటీ) సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కమిటీ సభ్యులు, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బా బు హాజరయ్యారు. రాష్ట్రంలో భూముల మానిటైజేషన్, ల్యాండ్ పూలింగ్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సబ్ కమిటీ నిర్ణయించింది.
ఇందులో భాగంగా హెచ్‌ఎండీఏ పరిధిలోని ప్రభుత్వ భూసంపదను సమర్థవంతంగా వినియోగించుకునేందుకు అధికారులు సిద్ధం చేసిన సమగ్ర ప్రణాళికపై విస్తృతంగా చర్చించారు. నగర పరిధిలో ఉప్పల్ భగాయత్ తరహాలోనే పారదర్శక విధానాలను అవలంబిస్తూ, మరిన్ని ప్రాంతాల్లో ల్యాండ్ పూలింగ్ చేపట్టేందుకు ఉన్న అవకాశాలను తక్షణమే గుర్తించాలని అధికారులను ఆదేశించారు. రంగారెడ్డి, మేడ్చల్- మల్కాజిగిరి, యాదాద్రి భువనగిరి జిల్లాల వారీగా ఉన్న ప్రభుత్వ భూసంపదను గుర్తించి, ల్యాండ్ పూలింగ్ చేయడానికి ఉన్న సాధ్యాసాధ్యాలను అన్వేషించాలని ఆయా జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. మున్సిపల్ -పట్టణాభివృద్ధి శాఖ, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ, పరిశ్రమలు,
ఎక్సైజ్, మైనింగ్, రెవెన్యూ, రవాణా, స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్, కమర్షియల్ తదితర కీలక శాఖలలో ప్రస్తుత వనరుల పురోగతిపై డిప్యూటీ సిఎం ఆరా తీశారు. ఈ సందర్బంగా డిప్యూటీ సిఎం మాట్లాడుతూ 2026-27 ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదించనున్న బడ్జెట్ అంచనాలకు అనుగుణంగా నిధుల సమీకరణ జరగాలని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. బడ్జెట్ లక్ష్యాలను చేరుకోవడానికి అందుబాటులో ఉన్న అన్ని రకాల ఆదాయ వనరులను పూర్తి స్థాయిలో అందిపుచ్చుకొని, ముందుగా నిర్దేశించుకున్న టైమ్‌లైన్ ప్రకారమే అన్ని శాఖల అధికారులు ఆదాయ పెంపు కోసం శ్రమించాలన్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, ప్లానింగ్ సెక్రటరీ గౌరవ్ ఉప్పల్ తదితరులు పాల్గొన్నారు.

