Dailyhunt
వారిపై రహానే విమర్శలు చేయడం సరికాదు: సెహ్వాగ్

వారిపై రహానే విమర్శలు చేయడం సరికాదు: సెహ్వాగ్

న్యూఢిల్లీ: కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్ అజింక్య రహానె తీరును భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ తప్పుపట్టాడు. కోల్‌కతా వరుస ఓటముల నేపథ్యంలో జట్టుపై విమర్శలు వస్తున్నాయని, దాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నాడు.

అయితే దానికి భిన్నంగా కోల్‌కతా కెప్టెన్ రహానె మీడియాపై విమర్శలకు దిగడం సరికాదన్నాడు. జట్టు ఓటములు పాలైతే ఎవరైనా కెప్టెన్‌నే ప్రశ్నిస్తారన్నాడు. దానికి సారథిగా ఉన్న వ్యక్తి సమాధానం ఇవ్వాల్సి ఉంటుందన్నాడు. కానీ రహానె మాత్రం సమాధానం ఇవ్వకుండా వారిపై విమర్శలకు దిగడం మంచి సంప్రదాయం కాదన్నాడు. రహానె ఇలాంటి వాటికి స్వస్తి పలికి బ్యాటింగ్ మెరుగు పరుచుకోవడంపై దృష్టి సారించాలని సెహ్వాగ్ హితవు పలికాడు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Mana Telangana Telugu