వరుసగా మ్యాచ్‌లలో విఫలం కావడంతో టి-20 వరల్డ్ కప్ హీరో సంజూ శాంసన్‌ను టీం ఇండియా మేనేజ్‌మెంట్ పక్కన పెట్టింది. జింబాబ్వే సిరీస్‌కూ అతడిని ఎంపిక చేయలేదు.
దీంతో విమర్శలు ఎదురుకుంటోంది. ఈ క్రమంలో ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ మౌనం వీడారు. సంజూని తప్పించడానికి గల కారణాలను వెల్లడించారు. ఇంగ్లండ్ చేతిలో మూడో టి-20లో ఘోర పరాజయాన్ని చవి చూసిన తర్వాత గంభీర్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
''జట్టులో నుంచి ఎందుకు తప్పించామనే విషయంపై సంజూ శాంసన్‌కు నా వైపు నుంచి స్పష్టత ఇచ్చాను. ఇది కేవలం ప్రధాన కోచ్, ప్లేయర్‌కు మధ్య జరిగిన సంభాషణ. ఆ వివరాలను బయటకు వెల్లడించలేను. సంజూ విషయంలో మేం క్లారిటీగా ఉన్నాము. భారత జట్టుకు అతడు చేసిన దేనినీ మర్చిపోలేము. అయితే, ఏదైనా సిరీస్‌కు ఎంపిక చేసేటప్పుడు సదరు ప్లేయర్ ఫామ్‌ను కూడా పరిగణనలోకి తీసుకుంటాం. సంజూ మళ్లీ పుంజుకుని ఇదే సిరీస్‌లో పునరాగమనం చేయొచ్చు. వరల్డ్ కప్ ముందు అతడు ఇబ్బంది పడిన సందర్భాలు ఉన్నాయి. కానీ, ఆ టోర్నీలో అద్భుతమైన ఆటతీరుతో ఆట్టుకున్నాడు'' అని గంభీర్ చెప్పుకోచ్చారు.

