దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి విస్తరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రాజన్న ఆలయ అభివృద్ధిలో భాగంగా ఇప్పటికే 2023.24 బడ్జెట్లో రూ.50 కోట్లు, 2024.-25 బడ్జెట్లో రూ.100 కోట్లు విడుదల చేయగా శనివారం మరో రూ.99.40 కోట్ల నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవతో రూ.150 కోట్లతో సుమారు 45 శాతం పనులు పూర్తికాగా మరో రూ.99 కోట్లు నిధులు విడుదల కావడంతో రాజన్న ఆలయ అభివృద్ధి విస్తరణ పనులు మరింత వేగంగా పూర్తి కానున్నాయి. కాగా నిధులు మంజూరుకు విశేష కృషిచేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు కొండా సురేఖ, శ్రీధర్ బాబు, పొన్నo ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌లకు రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ధన్యవాదాలు తెలిపారు.

