బిజినిపల్లి: నాగర్ కర్నూల్ జిల్లా బిజినిపల్లి మండలం ఉయ్యాలవాడ మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేయడం జరిగిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
విద్యార్థులు పాఠశాలలు పునఃప్రారంభం అయినప్పటి నుండి ఇప్పటి వరకు జరిగిన పాఠ్యాంశాల పై ఆరా తీశామని, విద్యార్థుల సమస్యల పై అడిగి తెలుసుకున్నామని, విద్యార్థులు స్నానాలు చేయడానికి వేడి నీరు రావడానికి సోలార్ ప్లాంట్ మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. విద్యార్థులు బాగా చదువుకోవాలని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని సూచించడం జరిగిందని, విద్యార్థులకు అందుతున్న మెనూ అందుతున్న భోజన వివరాలు అడిగి తెలుసుకున్నామన్నారు. స్టోర్ రూమ్ లో వంట సరుకుల నాణ్యత పరిశీలించడం జరిగిందని, వంటకగది లో వండిన ఆహార పదార్థాలతో పాటు కూరగాయలు పరిశీలించామని, తాజా కూరగాయలు వంటల్లో ఉపయోగించాలని సిబ్బందికి మంత్రి పొన్నం సూచించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి, జిల్లా కలెక్టర్, ఎస్పీ, అధికారులు పాల్గొన్నారు.

