Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
విజయ్‌కు షాక్.. ప్రభుత్వం ఏర్పాటు కోసం మద్దతుకు నిరాకరణ

విజయ్‌కు షాక్.. ప్రభుత్వం ఏర్పాటు కోసం మద్దతుకు నిరాకరణ

టివికె చీఫ్ విజయ్‌కు షాక్ తగలింది. తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటు కోసం విజయ్‌కు మద్దతు ఇచ్చేందుకు వామపక్ష పార్టీలు నిరాకరించినట్లు తెలుస్తోంది. మద్దతు ఇవ్వమని వామపక్షాలు తేల్చి చెప్పినట్లు సమాచారం.

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టివికె పార్టీ 108 స్థానాల్లో విజయం సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 118 సీట్లు కావాలి.

ఈ నేపథ్యంలో విజయ్.. కాంగ్రెస్, వామపక్ష పార్టీల మద్దుతు కోరారు. మద్దతు ఇచ్చచేందుకు కాంగ్రెస్ ఒప్పుకోగా.. వామపక్షాలు అందుకు నిరాకరించాయి. తమిళనాడులో 4 సీట్లు గెలిచిన వామపక్షాలు.. తాము కూటమిలోనే కొనసాగుతామని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే, విజయ్ టివికె పార్టీకి మద్దతు ఇవ్వమని ముస్లిం లీగ్ పార్టీ స్పష్టం చేసింది. దీంతో టివికె నేతలు.. అన్నడిఎంకె ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Mana Telangana Telugu