సంగారెడ్డి జిల్లాలో విషాద సంఘటన చోటుచేసుకుంది. బట్టలు ఉతికేందుకు వెళ్లి బావిలో పడి ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటన జిల్లాలోని కంగ్టి మండలం బోర్గి గ్రామంలో జరిగింది.
స్థానికులు బావిలో నుంచి మృతులను ముగ్గురి మృతదేహాలను బయటకు తీసుకొచ్చారు. మృతి చెందిన వారిని తల్లి సావిత్రిబాయి, కుమార్తెలు నిఖిత(13), నందిని(12)గా గుర్తించారు. ఒకే కుటుంబంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

