Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వోక్స్‌వ్యాగన్‌లో లక్ష ఉద్యోగాల కోత

వోక్స్‌వ్యాగన్‌లో లక్ష ఉద్యోగాల కోత

న్యూయార్క్ : జర్మనీ కార్ల తయారీ సంస్థ వోక్స్‌వ్యాగన్ ఈ దశాబ్దం చివరి నాటికి 1 లక్ష ఉద్యోగాలను తగ్గించనున్నట్లు ప్రకటించింది. యాజమాన్యం, యూనియన్లు ఇప్పటికే అంగీకరించిన 50 వేల కోతలకు తోడు మరో 50 వేల ఉద్యోగాల తగ్గింపునకు ఆమోదం తెలిపాయి.

అంతర్జాతీయ కారు పరిశ్రమలో ఎన్నడూ లేనంతగా భారీ పునర్వవస్థీకరణ ఇదే. అమెరికా టారిఫ్‌లు, ఈవీలకు తగ్గిన డిమాండ్, చైనా నుండి పోటీ వంటి అంశాలు ఈ కోతలకు ప్రధాన కారణాలుగా ఉన్నాయి. హన్నోవర్, ఎమ్డెన్, జ్వికావు, నెక్కర్సల్మ్‌లలోని 4 జర్మన్ ప్లాంట్ల భవిష్యత్తుకు గ్యారెంటీ లేదని సంస్థ తెలిపింది. సంస్థ సిఇఒ ఆలివర్ బ్లూమ్ స్పందిస్తూ, సూపర్‌వైజరీ బోర్డు ఏకగ్రీవంగా భవిష్యత్తు ప్రణాళికను ఆమోదించిందనారు. అయితే యూనియన్ ప్రతినిధులు క్రిస్టియానే బెన్నర్, డానియెలా కావాలో స్పందిస్తూ, తాము ఏ ప్లాంట్‌ను వదులుకోలేదని, ప్లాంట్ల మూసివేతకు ఆమోదం తెలపలేదని స్పష్టం చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Mana Telangana Telugu