బెంగళూరు: బంగారు ఆభరణాల కోసం వృద్ధురాలిని చంపేసి అనంతరం మృతదేహాన్ని సూట్‌కేసులో పెట్టి చెరువులో పడేసిన సంఘటన కర్నాటక రాష్ట్రం బెంగళూరులోని కుంబళగోడు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... చల్లఘట్టలో జయమ్మ అనే వృద్ధురాలు నివసిస్తోంది. ఆమె ఇంటి పక్కన గగన్ అనే యువకుడు నివసిస్తున్నాడు. ఆన్‌లైన్ బెట్టింగ్ చేయడంతో అతడు డబ్బులు పొగొట్టుకోవడంతో అప్పుల పాలయ్యాడు. జయమ్మకు ఫోన్ లేకపోవడంతో పక్కింటి వారిని అడిగి తన బంధువులకు ఫోన్ చేసేది. గగన్ ఫోన్ చేయమని15వ తేదీన అడిగింది. ఆమె మెడలో బంగారు ఆభరణాలు ఉండడంతో వృద్ధురాలని గొంతునులిమి చంపేశాడు. అనంతర మృతదేహాన్ని సూట్‌కేసులో పెట్టి యాప్‌లో ఆటో బుక్ చేసుకున్నాడు. రామోహళ్లి ప్రాం తంలో తిమ్మప్ప చెరువు వద్దకు ఆటోలో మృతదేహాన్ని తీసుకెళ్లాడు. చీకటి పడిన తరువాత మృతదేహాన్ని చెరువులో పడేసి వెళ్లిపోయాడు. జయమ్మ కనిపించడంలేదని ఆమె బంధువులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తుండగా వృద్ధురాలి కోసం గగన్ ముందుండి వెతికినట్టు నటించారు. వెంటనే అతడిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా అసలు నిజాలు బయటకు వచ్చాయి. వెంటనే అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

