Dailyhunt
యశస్వి, వైభవ్ విశ్వరూపం.... రాజస్థాన్ గెలుపు

యశస్వి, వైభవ్ విశ్వరూపం.... రాజస్థాన్ గెలుపు

గౌహతి: ఐపిఎల్ లో ముంబయి ఇండియన్స్ పై రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం సాదించింది. ఎంఐపై ఆర్ఆర్ 27 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్ఆర్ 151 పరుగుల లక్ష్యాన్ని ముంబయి ముందు ఉంచింది.

కానీ ముంబయి బ్యాట్స్ మెన్లు ఘోరంగా విఫలం కావడంతో 11 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 123 పరుగులు చేసి ఓటమిని చవిచూసింది. ముంబయి బ్యాట్స్ మెన్లలలో నమన్ ధిర్(25), రూథర్ పోర్డ్(25), తిలక్ వర్మ(14) పరుగులు చేసి పర్వాలేదనిపించారు. మిగిలిన బ్యాట్స్ మెన్లు సింగల్ డిజిట్ కే పరిమితమయ్యారు. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 11 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 150 పరుగుల రికార్డు స్కోరును సాధించింది. వర్షం వల్ల మ్యాచ్‌ను 11 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేపట్టిన రాజస్థాన్‌కు ఓపెనర్లు యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీలు విధ్వంసక ఆరంభాన్ని అందించారు.

ఇద్దరు తొలి బంతి నుంచే ప్రత్యర్థి జట్టు బౌలర్లపై విరుచుకు పడ్డారు. పోటీ పడి ఫోర్లు, సిక్సర్లతో స్కోరును పరిగెత్తించారు. ఈ క్రమంలో 13 బంతుల్లోనే 50 పరుగులను జోడించి ఐపిఎల్‌లో సరికొత్త రికార్డును నెలకొల్పారు. ఐపిఎల్ చరిత్రలో ఇదే అత్యంత వేగవంతమైన అర్ధ సెంచరీగా నిలిచింది. చెలరేగి ఆడిన వైభవ్ 14 బంతుల్లోనే ఐదు భారీ సిక్సర్లు, ఒక ఫోర్‌తో 39 పరుగులు చేశాడు. ఇక సునామీ ఇన్నింగ్స్ ఆడిన యశస్వి జైస్వాల్ 32 బంతుల్లోనే 4 సిక్సర్లు, 10 ఫోర్లతో 77 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇక కెప్టెన్ రియాన్ పరాగ్ (20) కూడా వేగంగా ఆడడంతో రాజస్థాన్ భారీ స్కోరును నమోదు చేసింది. 32 బంతుల్లో 77 పరుగులు చేసిన జైశ్వాల్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Mana Telangana Telugu