Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
యుపిఐ లావాదేవీల్లో సరికొత్త రికార్డు

యుపిఐ లావాదేవీల్లో సరికొత్త రికార్డు

న్యూఢిల్లీ : దేశంలో యుపిఐ లావాదేవీల జోరు కొనసాగుతూ... తాజాగా అది సరికొత్త రికార్డును సృష్టించింది. జులైలో రూ.29.88లక్షల కోట్ల లావాదేవీలు జరిగాయి.

ఈ మేరకు శనివరం నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. గతేడాది ఇదే నెలతో పోల్చితే 22శాతం అదనంగా లావాదేవీలు జరిగినట్లు ఎన్‌పిసిఐ వెల్లడించింది. అయితే విలువ పరంగా అది 19శాతంగా తెలిపింది.

జులైలో రోజుకు సగటుగా 96వేల కోట్ల లావాదేవీలు జరిగినట్లు తెలిపింది. దేశంలో పట్టణాలు, నగరాల్లోనే కాకుండా గ్రామీణ స్థాయిలోకి సైతం యుపిఐ లావాదేవీలు చొచ్చుకు పోవడం వల్లే ఇది సాధ్యమైందని పేమెంట్స్ కార్పొరేషన్ ప్రకటనలో పేర్కొంది. రీఛార్జ్‌ల కోసం కూడా ప్రజలు డిజిటల్ లావాదేవీలనే ఉపయోగిస్తున్నారని వివరించింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Mana Telangana Telugu