ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పట్ జిల్లాలో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాజస్థాన్‌కు చెందిన ప్రయాణికులతో బదాయూన్ కు వెళ్తున్న పికప్ వాహనం రోడ్డు డివైడర్‌ను ఢీకొని బోల్తాపడటంతో 12 మంది మృతి చెందారు.
మరో 12 మందికి పైగా గాయపడ్డారు. ఈ మేరకు జిల్లా పోలీసులు వివరాలు వెల్లడించారు. మృతుల వివరాలను గుర్తించే ప్రక్రియ సాగుతోందని చెప్పారు. కేఖ్రా పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం అర్ధరాత్రి సుమారు 12.30 గంటలకు ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. 32 మంది ప్రయాణికులతో వెళ్తున్న వాహనం అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని బోల్తాపడినట్లు సమాచారం అందడంతో హుటాహుటిన వెళ్లి సహాయక చర్యలు చేపట్టామని, క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు.

