నీట్ మృతుల కుటుంబాలకు మూడు నెలల్లో పరిహారం ఇస్తాం
కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జెపి నడ్డా
న్యూఢిల్లీ : సిజెపి ఆందోళన కార్యక్రమాల సందర్భంగా విద్యార్థులపై నమోదైన అన్ని ఎఫ్‌ఐఆర్‌లను ఉపసంహరించుకుంటామని, వారిపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోబోమని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా మంగళవారం తెలిపారు.
దేశ యువత సంక్షేమం, అభ్యున్నతే ప్రభుత్వానికి అత్యున్నత ప్రాధాన్యమని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. నీట్ పేపర్ లీక్ అనంతరం ఆత్మహత్యలకు పాల్పడిన విద్యార్థుల కుటుంబాలకు 90 రోజుల్లో తగిన పరిహారం అందించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. సెప్టెంబర్ 5న ఢిల్లీలో నిర్వహించాల్సిన ర్యాలీని విరమించుకోవడంపై సీజేపీ తీసుకున్న నిర్ణయాన్ని నడ్డా స్వాగతించారు. బీజేపీ పాలిత రాష్ట్రాలతో కేంద్రం చర్చలు జరిపిందని, తమ పరిధిలో సీజేపీ ఆందోళనకారులపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను ఉపసంహరించుకుంటామని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు హామీ ఇచ్చాయని తెలిపారు.

