Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
2 వారాలు గ్రీన్ టీ ట్రై చేశారా?.. రిజల్ట్ ఇదే!

2 వారాలు గ్రీన్ టీ ట్రై చేశారా?.. రిజల్ట్ ఇదే!

రోజుల్లో ఫిట్‌నెస్, ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టే ప్రతి ఒక్కరి ఇంట్లో 'గ్రీన్ టీ' కామన్‌గా కనిపిస్తోంది. అయితే, వరుసగా 14 రోజుల పాటు రోజుకు ఒకటి లేదా రెండు కప్పుల గ్రీన్ టీ తాగితే మన శరీరంలో అద్భుతమైన మార్పులు వస్తాయని ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ సౌరభ్ సేథీ చెబుతున్నారు.

మరి కేవలం రెండు వారాల్లోనే గ్రీన్ టీ మన బాడీలో ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో, దానివల్ల కలిగే లాభాలేంటో సింపుల్‌గా తెలుసుకుందామా..

కాలేయానికి (Liver) శ్రీరామరక్ష: మనం తినే జంక్ ఫుడ్, మారిన లైఫ్ స్టైల్ వల్ల చాలామందిలో లివర్ వాపు (ఇన్‌ఫ్లమేషన్) లేదా ఫ్యాటీ లివర్ వంటి సమస్యలు వస్తుంటాయి. అయితే, రెండు వారాల పాటు క్రమంగా గ్రీన్ టీ తాగడం వల్ల లివర్‌లో వచ్చే వాపు గణనీయంగా తగ్గుతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.ఇక ఇది లివర్‌లోని హానికరమైన టాక్సిన్లను బయటకు పంపేసి దాన్ని క్లీన్ చేస్తుంది.

మెటబాలిజం పెరిగి బరువు తగ్గుతారు: బరువు తగ్గాలని డైటింగ్స్, వర్కౌట్స్ చేసేవారికి గ్రీన్ టీ ఒక బెస్ట్ ఫ్రెండ్ లాంటిది. ఇది శరీరంలో మెటబాలిజం (జీవక్రియ) రేటును బాగా వేగవంతం చేస్తుంది. ఇక దీనివల్ల బాడీలో పేరుకుపోయిన క్యాలరీలు, కొవ్వు వేగంగా కరిగిపోతాయి. కేవలం 14 రోజుల్లోనే మీ పొట్ట చుట్టూ ఉండే కొవ్వు తగ్గడం మీరు గమనించవచ్చు.

Tried Green Tea for 2 Weeks? Here's the Surprising Result

బ్రెయిన్ పవర్, ఏకాగ్రత పెరుగుతాయి: గ్రీన్ టీ తాగడం వల్ల కేవలం శారీరక ఆరోగ్యమే కాదు.. మానసిక ప్రశాంతత కూడా దక్కుతుంది. ఇందులో ఉండే ‘ఎల్-థియానిన్’ (L-Theanine) అనే అమైనో ఆమ్లం మెదడును రిలాక్స్ చేస్తుంది. ఇక అదే సమయంలో మీ ఏకాగ్రతను (ఫోకస్), జ్ఞాపకశక్తిని పెంచడానికి ఇది అద్భుతంగా తోడ్పడుతుంది. ఆఫీస్ ఒత్తిడిలో ఉన్నప్పుడు ఒక కప్పు గ్రీన్ టీ తాగితే ఆ కిక్కే వేరు!

చర్మ సౌందర్యం మెరుగవుతుంది: గ్రీన్ టీలో యాంటీఆక్సిడెంట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలోని కణాల నష్టాన్ని నివారిస్తాయి. ఇక రోజూ గ్రీన్ టీ తీసుకోవడం వల్ల ముఖంపై ముడతలు తగ్గి, చర్మం సహజంగా మెరుస్తుంది. వయసు పైబడిన లక్షణాలు త్వరగా రాకుండా చేయడంలో ఇది బాగా హెల్ప్ అవుతుంది.

రెండు వారాల పాటు గ్రీన్ టీని మీ లైఫ్ స్టైల్‌లో భాగం చేసుకుంటే బాడీలో వచ్చే పాజిటివ్ చేంజ్స్ చూసి మీరే ఆశ్చర్యపోతారు. ఇక మార్కెట్లో దొరికే ఆర్టిఫిషియల్ ఎనర్జీ డ్రింక్స్ జోలికి వెళ్లకుండా, రోజుకు ఒకట్రెండు కప్పుల వేడి వేడి గ్రీన్ టీ తాగుతూ మీ ఆరోగ్యాన్ని హ్యాపీగా కాపాడుకోండి.

గమనిక: గ్రీన్ టీ ఆరోగ్యానికి చాలా మంచిదే అయినప్పటికీ, అమితంగా తాగకూడదు. రోజుకు 2 కప్పుల కంటే ఎక్కువ తాగితే నిద్రలేమి లేదా అసిడిటీ వంటి సమస్యలు రావచ్చు. అలాగే ఖాళీ కడుపుతో కాకుండా, ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తర్వాత లేదా సాయంత్రం స్నాక్స్ టైంలో తాగడం ఉత్తమం.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Manalokam Telugu