Saturday, 19 Sep, 7.53 am మన లోకం

వార్తలు
అలర్ట్ : మరో మూడు రోజులు భారీ వర్షాలు

తాజాగా మరో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో మరో మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇప్పటికే గత ఐదు రోజులుగా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. చెరువులు నిండి అలుగులు పారుతున్నాయి. వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. తెలంగాణ, దాని పరిసర ప్రాంతాల్లో 2.1 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవార్తనం కొనసాగుతోంది. మరో వైపు కోస్తాంధ్ర, దాని పరిసర ప్రాంతాల్లోనూ దాదాపు మూడు కిలోమీటర్ల ఎత్తు వరకు మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఈశాన్య బంగాళాఖాతంలోనూ ఆదివారం మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

ఈ నేపథ్యంలో శని, ఆదివారాల్లో తెలంగాణ వ్యాప్తంగా వానలు పడే అవకాశం ఉందని, పలు చోట్ల భారీ వర్షాలు పడుతాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రధానంగా ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, మంచిర్యాల, కరీంనర్‌, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, వరంగల్‌ అర్బన్‌, రూరల్‌, మహమూబాబాద్‌, భద్రాద్ది కొత్తగూడెం, ఖమ్మంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం చెప్పింది.


Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Manalokam Telugu
Top