Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అమృత కాంబో!.. వెల్లుల్లి-నెయ్యి మిక్స్‌తో వ్యాధులకు చెక్!

అమృత కాంబో!.. వెల్లుల్లి-నెయ్యి మిక్స్‌తో వ్యాధులకు చెక్!

న భారతీయ వంటగదిలో నెయ్యి, వెల్లుల్లి లేని రోజంటూ ఉండదు. అయితే ఈ రెండింటినీ కలిపి తీసుకుంటే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆయుర్వేదం చెబుతోంది.

నెయ్యిలో వేయించిన వెల్లుల్లిని క్రమం తప్పకుండా తింటే మన శరీరానికి ఒక సూపర్ పవర్ లభించినట్లే అవుతుంది. అసలు దీని వల్ల కలిగే ఆ అద్భుత లాభాలేంటో ఇప్పుడు చూద్దాం.

రోగనిరోధక శక్తి పెరుగుతుంది: వెల్లుల్లిలో ‘అల్లిసిన్’ అనే పవర్‌ఫుల్ సమ్మేళనం ఉంటుంది. దీనికి యాంటీ బాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఎక్కువ. వెల్లుల్లిని నెయ్యిలో వేయించినప్పుడు ఆ పోషకాలను మన శరీరం చాలా త్వరగా గ్రహిస్తుంది. ఇక ఈ మిశ్రమం శరీరంలో సహజ రోగనిరోధక శక్తిని పెంచి.. జలుబు, దగ్గు, వైరల్ ఇన్ఫెక్షన్ల బారి నుండి మనల్ని కాపాడుతుంది.

జీర్ణ సమస్యలకు గుడ్ బై: నెయ్యిలో ‘బ్యూట్రిక్ యాసిడ్’ అనే మంచి పదార్థం ఉంటుంది. ఇది మన జీర్ణవ్యవస్థను క్లీన్ చేయడానికి బాగా హెల్ప్ చేస్తుంది. ఇక ఎవరైతే గ్యాస్, కడుపు ఉబ్బరం, అజీర్ణం, మలబద్ధకం (కాన్స్టిపేషన్) వంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటారో వారికి ఈ నెయ్యి-వెల్లుల్లి మిశ్రమం ఒక సూపర్ హోమ్ రెమెడీలా పనిచేస్తుంది.

Miracle Combo!.. Garlic and Ghee Mix for Better Health!

గుండె ఆరోగ్యానికి మేలు: వెల్లుల్లి శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, హై బ్లడ్ ప్రెజర్‌ను కంట్రోల్‌లో ఉంచుతుంది. అదే సమయంలో నెయ్యిలో ఉండే మంచి కొవ్వులు గుండె పనితీరును మెరుగుపరుస్తాయి. అంతేకాదు ఇక శరీరంలోని అంతర్గత వాపులను తగ్గించి, ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచడంలో కూడా ఈ కాంబినేషన్ కీలక పాత్ర పోషిస్తుంది.

ఎలా తీసుకోవాలి?: వెల్లుల్లి రెబ్బలను వలుచుకుని, కొద్దిగా నెయ్యి వేసి దోరగా వేయించుకోవాలి. వీటిని ఉదయాన్నే పరగడుపున తిన్నా లేదా రాత్రి పడుకునే ముందు తీసుకున్నా మంచి ఫలితాలు ఉంటాయి. అయితే ఏ రోజైనా సరే 2 నుంచి 3 రెబ్బల కంటే ఎక్కువ తీసుకోకూడదు.

ప్రకృతి మనకు ఇచ్చిన అద్భుతమైన ఔషధాల్లో నెయ్యి, వెల్లుల్లి కాంబినేషన్ ఒకటి. దీన్ని సరైన పద్ధతిలో రోజూ డైట్‌లో చేర్చుకుంటే చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ పటాపంచలైపోతాయి. ఇక అమృతం అయినా సరే లిమిట్‌గా తీసుకుంటేనే ఆరోగ్యానికి మంచిది కదా!

గమనిక: నెయ్యి, వెల్లుల్లి మిశ్రమాన్ని అతిగా తీసుకుంటే అజీర్ణం లేదా కడుపులో మంట వంటి సమస్యలు రావచ్చు. కాబట్టి ఏదైనా తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఉన్నవారు లేదా గర్భిణీలు వైద్యుల సలహా తీసుకున్న తర్వాతే దీనిని వాడడం మంచిది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Manalokam Telugu