Dailyhunt
బ్రేకింగ్ : తెలంగాణకు మరో సారి కేంద్ర బృందం

బ్రేకింగ్ : తెలంగాణకు మరో సారి కేంద్ర బృందం

దేశంలో కరోనా వైరస్‌ కేసులు రోజు రోజుకీ విపరీతంగా పెరుగుతున్నాయి. అయితే అన్ని రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణలో కరోనా కంట్రోల్ లో ఉన్నట్టు కనిపించినా తెలంగాణలో కూడా కరోనా కేసులు భారీగానే నమోదు అవుతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణకు మరోసారి కేంద్ర బృందం వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యలను ఈ బృందం పరిశీలించనున్నట్టు చెబుతున్నారు.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటూ బస్తీలలో ఉన్న హాస్పిటల్స్ ని సందర్శించే అవకాశం ఉందని అంటున్నారు. అంతే కాక కరోనా వైద్యం అందిస్తోన్న ప్రయివేట్ ఆస్పత్రులను కూడా ఈ బృందం పరిశీలించే అవకాశం ఉందని అంటున్నారు. ప్రస్తుతానికి కరోనా కేసులు తక్కువగానే నమోదవుతున్నా ఇలా పెరుగుతూ పోతే తెలంగాణ కూడా మళ్ళీ కరోనా భారీగా సోకుతున్న రాష్ట్రాల జాబితాలో చేరే ప్రమాదం ఉందని భావిస్తోన్న కేంద్ర ఆరోగ్య శాఖ చికిత్స ఏర్పాట్లను పరిశీలించేందుకు సిద్దమవుతున్నట్టు చెబుతున్నారు.

అయితే దీని మీద అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.


Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Manalokam Telugu