Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
చిన్న జాజికాయ.. పెద్ద ఆరోగ్య ప్రయోజనాలు.. తెలుసుకోండి!

చిన్న జాజికాయ.. పెద్ద ఆరోగ్య ప్రయోజనాలు.. తెలుసుకోండి!

వంటకాల్లో సుగంధ ద్రవ్యంగా వాడే జాజికాయ కేవలం రుచికే కాదు, అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలకు కూడా నిలయం. కొద్దిగా ఘాటు, వగరు రుచి కలిగిన ఈ మసాలా దినుసును పురాతన కాలం నుండి సహజ ఔషధంగా ఉపయోగిస్తున్నారు.

గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, రక్తంలో షుగర్ లెవల్స్‌ను నియంత్రించడంతో పాటు ఒత్తిడిని తగ్గించడంలో ఇది ఎంతో సహాయపడుతుంది. అయితే, జాజికాయను ఎప్పుడూ పరిమిత పరిమాణంలోనే తీసుకోవాలి. రోజూవారీ జీవితంలో జాజికాయతో కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

జలుబు, దగ్గు నుంచి తక్షణ ఉపశమనం: వానాకాలం లేదా చలికాలంలో వేధించే జలుబు, దగ్గును తగ్గించడంలో జాజికాయ ఎంతో బాగా పనిచేస్తుంది. పిల్లల నుంచి పెద్దల వరకు ఇది మేలు చేస్తుంది. కొద్దిగా జాజికాయ పొడిని గోరువెచ్చని పాలలో కలిపి తీసుకుంటే గొంతు నొప్పి, దగ్గు లక్షణాలు త్వరగా తగ్గుతాయి.

కాంతివంతమైన చర్మం కోసం: ముఖంపై నల్ల మచ్చలు, మొటిమలు, ముడతలతో బాధపడేవారికి జాజికాయ మంచి పరిష్కారం. జాజికాయ పొడిని పచ్చి పాలు లేదా రోజ్ వాటర్‌తో కలిపి పేస్ట్‌లా చేసి ముఖానికి రాయాలి. వారానికి 2-3 సార్లు ఇలా చేస్తే చర్మం కాంతివంతంగా మారుతుంది. అయితే ఈ పేస్ట్‌ను ముఖంపై 10-12 నిమిషాల కంటే ఎక్కువ సేపు ఉంచకూడదు.

Tiny Nutmeg, Big Health Benefits: Know the Amazing Benefits

ఒత్తిడి తగ్గింపు - మంచి నిద్ర: నేటి జీవనశైలిలో చాలామందిని వేధించే ప్రధాన సమస్య ఒత్తిడి, నిద్రలేమి. రాత్రి పడుకునే ముందు రెండు చిటికెల జాజికాయ పొడిని గోరువెచ్చని పాలలో కలిపి తాగితే మనస్సు ప్రశాంతంగా మారి మంచి నిద్ర పడుతుంది. ఇక ఇది మూడ్‌ను మెరుగుపరచి మానసిక ప్రశాంతతను ఇస్తుంది.

కీళ్ల నొప్పులు, వాపులకు చెక్: ఆర్థరైటిస్, కీళ్ల నొప్పులు లేదా కండరాల వాపుతో బాధపడేవారికి జాజికాయ నూనె ఎంతో ప్రయోజనకరం. ఇక జాజికాయ పొడిని నువ్వుల నూనెతో కలిపి పేస్ట్‌లా చేసి నొప్పి ఉన్న చోట మర్దన చేస్తే నొప్పుల నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది.

నోటి దుర్వాసనకు స్వస్తి: జాజికాయలోని యాంటీబ్యాక్టీరియల్ గుణాలు నోటి దుర్వాసనను, చిగుళ్ల నొప్పులను సమర్థవంతంగా నివారిస్తాయి. ఇక చిన్న జాజికాయ ముక్కను నోట్లో వేసుకుని నమలడం లేదా జాజికాయ నూనెను చిగుళ్లపై అప్లై చేయడం వల్ల నోటి ఆరోగ్యం మెరుగుపడుతుంది.

ఇక చిన్న జాజికాయతో మనకు లభించే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో. రోజువారీ ఆహారంలో దీనిని తగిన పరిమాణంలో భాగం చేసుకోవడం వల్ల అనేక శారీరక, మానసిక సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందవచ్చు.

గమనిక: జాజికాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసినప్పటికీ, దీనిని అతిగా తీసుకోకూడదు. అధిక మోతాదులో తీసుకుంటే దుష్ప్రభావాలు కలిగే అవకాశం ఉంది కాబట్టి ఎల్లప్పుడూ చిటికెడు పరిమాణంలో మాత్రమే వాడటం శ్రేయస్కరం.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Manalokam Telugu