Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Chiranjeevi: ఓటీటీ క్రేజీ ఆఫర్ ను వదులుకున్న మెగాస్టార్! కారణమదేనా?

Chiranjeevi: ఓటీటీ క్రేజీ ఆఫర్ ను వదులుకున్న మెగాస్టార్! కారణమదేనా?

Chiranjeevi: టాలీవుడ్ లో మెగా స్టార్ చిరంజీవికి ఉన్న క్రేజ్ చెప్పనవసరం లేదు. సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన తరువాత జోరు పెంచాడు.

వరుసపెట్టి భారీ బడ్జెట్ గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. సీనియర్ డైరెక్టర్లకు కాకుండా టాలెంట్ ఉన్న డైరెక్టర్లకు దర్శకత్వం వహించే ఛాన్స్ ఇస్తున్నారు మెగా స్టార్. ఈ క్రమంలో కుర్ర హీరోలకు దీటుగా ఇప్పటికే ప్రకటించిన సినిమాలను శరవేగంగా పూర్తిచేస్తున్నారు.

అయితే.. ఈ క్రమంలో ప్రముఖ ఓటీటీ సంస్థ ఇచ్చిన క్రేజీ ఆఫర్ ను రిజెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. వెబ్ ఫిల్మ్‌లో నటించడానికి మెగాస్టార్ ని నటించాలని, ఇందుకోసం కేవలం 25 రోజుల కాల్ షీట్స్‌ను మాత్రమే ఇవ్వాలని కోరారట. ఇందుకోసం మెగా స్టార్ కు నిర్మాతలు రికార్డు స్థాయిలో రెమ్యునరేషన్ ఆఫర్ చేసారట. కథ నచ్చినా నటించడానికి చిరు ఆసక్తి చూపించట్లేదట. సున్నితంగా వారి ఆఫర్‌ను చిరంజీవి తిరస్కరించినట్లుగా సమాచారం.

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం డిజిటల్ ప్లాట్‌ఫార్మ్స్‌కు క్రేజ్ పెరుగుతోంది. బిగ్ స్క్రీన్‌పై సినిమాలకు ఎంత క్రేజ్ ఉందో, ఓటీటీల్లోని వెబ్ ఫిల్మ్స్‌కు, వెబ్ సిరీస్‌లకు కూడా అంతే క్రేజ్ ఏర్పడింది. అయినా
ఇప్పటికే మహేష్ బాబు పాటు పలువురు స్టార్ హీరోలు తన ప్రాధాన్యత థియేటర్లకు మాత్రమేనని వెల్లడించిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే జాబితాలోకి మెగాస్టార్ చిరంజీవి కూడా చేరారు. కానీ చిరు ఫ్యాన్స్ మాత్రం బాస్ డిజిటల్ ఎంట్రీ ఎప్పుడా అని ఎదురుచూస్తున్నారు.

ఇవి కూడా చదవండి

  1. MAA ELECTION : ఆ ప్యానెల్‌ కు మద్దతు ప్రకటించిన మెగాస్టార్‌ చిరంజీవి
  2. మరోసారి 30 ఇయర్స్ పృథ్వీ రాజ్‌ ఆడియో వైరల్ !
  3. prabhas 25 : “స్పిరిట్” తో వచ్చేసిన యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Manalokam Telugu