Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఏ దానం గొప్పది?.. సమాధానం ఇదే!

ఏ దానం గొప్పది?.. సమాధానం ఇదే!

విశాలమైన ప్రపంచంలో ఎన్నో రకాల దానాలు ఉన్నాయి. కానీ, ఆకలితో అలమటించే వారికి పెట్టే అన్నదానాన్ని మించిన గొప్ప దానం మరొకటి లేదని మన పెద్దలు చెబుతారు.

డబ్బు, నగలు ఆస్తులు ఎంత ఇచ్చినా మనిషికి ఇంకా కావాలనే ఆశ ఉంటుంది. కానీ ఒక్క అన్నదానంలో మాత్రమే తిన్న వ్యక్తి కడుపు నిండాక ‘చాలు’ అని మనస్ఫూర్తిగా తృప్తిని వ్యక్తం చేస్తాడు. అందుకే అన్నదానాన్ని మహాదానం అన్నారు.

చాలు’ అనిపించే ఏకైక దానం: మనం ఒకరికి ఎంత ధనం ఇచ్చినా, బంగారం ఇచ్చినా తృప్తి పడటం కష్టం. కానీ ఆకలితో ఉన్నవాడికి ప్రేమతో భోజనం పెడితే కడుపు నిండిన తర్వాత హాయిగా ‘చాలు’ అంటాడు.ఇక ఆ సమయంలో వారి ముఖంలో కనిపించే ఆనందం నోటి నుంచి వచ్చే దీవెనలు మన జీవితంలో ఎన్నో కష్టాలను ఇబ్బందులను సులభంగా దూరం చేస్తాయి. ఎదుటివారి ఆకలి తీర్చడం వల్ల వచ్చే ఆత్మసంతృప్తి మరెక్కడా దొరకదు.

Which Donation Is the Greatest?.. Here's the Real Answer!

చాణుక్యుడు చెప్పిన పరమార్థం: గొప్ప దార్శనికుడు ఆచార్య చాణుక్యుడు తన నీతిశాస్త్రంలో అన్నదానం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇక ఆకలితో ఉన్న ప్రాణికి అన్నం పెట్టడం వల్ల మనిషికి ఈ లోకంలోనే కాదు, మరణం తర్వాత కూడా పుణ్యలోకాల్లో అత్యున్నతమైన స్థానం లభిస్తుందని ఆయన స్పష్టం చేశారు. తోటి జీవుల ఆకలిని గుర్తించి ఆదరించడమే అసలైన మానవత్వమని మన శాస్త్రాలు కూడా చెబుతున్నాయి.

నేటి యువత ఏం చేయాలి?: ఈ రోజుల్లో చాలామంది యువత హోటళ్లకు వెళ్లినప్పుడు లేదా ఫంక్షన్లలో తెలియకుండానే ఎంతో ఆహారాన్ని వృథా చేస్తుంటారు. మనకు ఉన్నదానిలో అంతా కాకపోయినా, ఎంతో కొంత ఆకలితో ఉన్న అనాథలకు, పేదలకు పెట్టడం అలవాటు చేసుకోవాలి. ఇక సంపాదనలో కొంత భాగాన్ని సమాజంలోని వెనుకబడిన వారి ఆకలి తీర్చడానికి ఉపయోగిస్తే, ఆ జీవితానికి ఒక సార్థకత లభిస్తుంది.

డబ్బులు సంపాదించడం ఎంత ముఖ్యమో, మన చుట్టూ ఉన్నవారికి సహాయం చేయడం కూడా అంతకంటే ముఖ్యం. అన్నదానం చేయడానికి కోట్లకు పడగలెత్తాల్సిన అవసరం లేదు, సహాయం చేయాలనే మంచి మనసు ఉంటే చాలు. మన చేతనైనంతలో ఒకరి ఆకలి తీర్చి, ఆ పుణ్యంలో భాగస్వాములు అవుదాం.

గమనిక: మీ ఇంట్లో లేదా ఫంక్షన్లలో ఆహారం మిగిలిపోతే దానిని పారేయకుండా, మీ ప్రాంతంలో ఉండే స్వచ్ఛంద సంస్థలకు (NGOs) లేదా అవసరమైన పేదలకు చేరవేసే ప్రయత్నం చేయండి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Manalokam Telugu