Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఘనంగా 'సర్కారు బాయి' ఫస్ట్ లుక్ లాంచ్.. సినీ ప్రముఖుల చేతుల మీదుగా విడుదల

ఘనంగా 'సర్కారు బాయి' ఫస్ట్ లుక్ లాంచ్.. సినీ ప్రముఖుల చేతుల మీదుగా విడుదల

మన లోకం 4 months ago

తెలంగాణ సామాజిక నేపథ్యంతో, ఇక్కడి మట్టి వాసన ప్రతిబింబించేలా రూపొందుతున్న సరికొత్త సినిమా 'సర్కారు బాయి'. శ్రీరామ్ నిమ్మల, వర్షిక హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్ ఫిలిం ఛాంబర్‌లో ఘనంగా జరిగింది.

టాలీవుడ్ ప్రముఖ దర్శకులు తమ్మారెడ్డి భరద్వాజ, వీఎన్ ఆదిత్య ముఖ్య అతిథులుగా హాజరై ఈ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్ ఇప్పుడు ఇండస్ట్రీలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆ వివరాలు చూద్దాం..

తెలంగాణ బ్యాక్‌డ్రాప్.. 1985 నాటి వాస్తవ కథ: ఈ సినిమాను దర్శకుడు లారా పూర్తి వాస్తవికతకు దగ్గరగా తెరకెక్కిస్తున్నారు. 1985 కాలంలో తెలంగాణ ప్రాంతంలో జరిగిన కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా ఈ కథ నడుస్తుంది. ఇక ముఖ్యంగా అణగారిన వర్గాలకు నీరు అందకుండా జరిగిన అన్యాయాలు, సమాజంలో ఉన్న కుల వివక్ష, సామాజిక అసమానతలను ఈ సినిమాలో చాలా ఎమోషనల్‌గా చూపించబోతున్నారు. ఇక నీటి హక్కు కోసం సాగిన పోరాటమే ఈ చిత్రానికి ప్రధాన బలం.

Sarkaru Bai First Look Launched Grandly by Film Celebrities

నేషనల్ అవార్డ్ లెవెల్ సినిమా.. హీరోయిన్ ధీమా: ఈ చిత్రంలో నటిస్తున్న హీరో శ్రీరామ్ నిమ్మల మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ పోరాటం, సామాజిక అంశాలున్న కథలో నటించడం తన అదృష్టమని చెప్పారు. అలాగే తెలుగమ్మాయి అయిన హీరోయిన్ వర్షిక మాట్లాడుతూ.. కథ విన్నప్పుడే ఈ సినిమాకు జాతీయ అవార్డు ఖాయం అనే నమ్మకం కలిగిందని ఎంతో ఎమోషనల్ అయ్యారు. ఇక నిర్మాత తుమ్మల ప్రఫుల్ రాంరెడ్డి తమను ఎంతో బాగా చూసుకున్నారని చిత్ర యూనిట్ కొనియాడింది.

యువ నటుడి సినీ ప్రస్థానం: నటుడు శ్రీరామ్ నిమ్మల వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ టాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు.2020లో అశోక్ తిరుపతి దర్శకత్వంలో వచ్చిన 'ఉత్తర' చిత్రంతో హీరోగా ఇండస్ట్రీకి పరిచయమైన ఆయన, డెబ్యూ సినిమాతోనే తన నటనకు ప్రశంసలు అందుకుని మంచి గుర్తింపు సంపాదించారు. ఆ తర్వాత 2022లో రూట్ మార్చి వరుసగా మూడు విభిన్నమైన సినిమాలతో ప్రేక్షకులను పలకరించారు.

ఇక ‘సాఫ్టువేర్ బ్లూస్’ చిత్రంలో భార్గవ్ అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్న శ్రీరామ్, అదే ఏడాది యాక్షన్ డ్రామా ‘రుద్రవీణ’లో రుద్ర అనే పవర్‌ఫుల్ పాత్రలో, అలాగే లవ్ స్టోరీ ‘మది’ సినిమాలో అభిమన్యుగా ఎమోషనల్ పర్ఫార్మెన్స్‌తో మెప్పించారు. ఇక 2023లో ‘తురుమ్ ఖాన్‌లు’ చిత్రంలో శంకర్ అనే మాస్ క్యారెక్టర్‌తో పాటు ‘అనుకున్నవన్నీ జరగవు కొన్ని’ వంటి సినిమాలతో నటుడిగా తనలోని రకరకాల షేడ్స్‌ను ఆవిష్కరించుకుంటూ దూసుకుపోతున్నారు.ఇక ఇప్పుడు 'సర్కారు బాయి' గా రానున్నాడు.

భారీ తారాగణం.. పెరిగిన అంచనాలు: సికింద్రాబాద్ గణేష్ టెంపుల్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ సినిమాలో టాలెంట్ ఉన్న నటీనటులు నటిస్తున్నారు. ఇక బాహుబలి ప్రభాకర్, దివంగత నటుడు నాగమేశ్, దిలీప్ రమేష్, చలాకి చంటి వంటి వారు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక ప్రజా సమస్యలను ఎత్తిచూపుతూ సాగే ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులను ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని చిత్రబృందం నమ్మకంగా ఉంది.

సమాజంలో జరిగే అన్యాయాలపై ప్రశ్నించేలా వస్తున్న 'సర్కారు బాయి' సినిమా ఫస్ట్ లుక్‌తోనే పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేసింది. కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు మంచి సందేశం ఉన్న ఇలాంటి సినిమాలు ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తాయి. ఈ క్రేజీ ప్రాజెక్ట్ త్వరలోనే మరిన్ని అప్‌డేట్స్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Manalokam Telugu