Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
గుడిలో ఇలా నిలబడుతున్నారా? గుడిలో ఈ నియమాలు తప్పనిసరి

గుడిలో ఇలా నిలబడుతున్నారా? గుడిలో ఈ నియమాలు తప్పనిసరి

నసుకు ప్రశాంతత కోసం, భగవంతుని ఆశీస్సుల కోసం మనం తరచూ గుడికి వెళ్తుంటాం. దేవాలయంలో ఉండే పాజిటివ్ వైబ్స్ మన ఒత్తిడిని దూరం చేస్తాయి. అయితే, గుడికి వెళ్లినప్పుడు చాలామంది తెలియక కొన్ని తప్పులు చేస్తుంటారు.

ఆలయ నియమాలకు భంగం కలిగించకుండా ఎలా నడుచుకోవాలి, అక్కడ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వాస్తు శాస్త్ర నిపుణులు మరియు ఆధ్యాత్మిక గ్రంథాలు కొన్ని ముఖ్యమైన విషయాలను సూచిస్తున్నాయి. ఆ వివరాలు చూద్దాం.

దేవుడికి ఎదురుగా అస్సలు నిలబడకూడదు: చాలామంది గుడికి వెళ్లగానే గర్భాలయంలో ఉండే దేవుడికి సరిగ్గా ఎదురుగా నిలబడి దర్శనం చేసుకోవాలని చూస్తుంటారు. ఇక కానీ అది ఏమాత్రం మంచిది కాదని పండితులు చెబుతున్నారు. దేవాలయాలలో దేవుళ్ళను దర్శనం చేసుకునేటప్పుడు విగ్రహానికి కుడివైపున లేదా ఎడమవైపున నిలబడాలి తప్ప, పొరపాటున కూడా అస్సలు ఎదురుగా నిలబడకూడదు.

దీని వెనుక ఉన్న అసలు కారణం ఇదే: గుడిలో విగ్రహాలను ప్రతిష్టించే సమయంలో ఎన్నో మంత్ర శక్తులను ఆ విగ్రహానికి ఆపాదిస్తారు. ఈ భగవంతుని శక్తి ఎప్పుడూ తరంగాల రూపంలో బయటకు వస్తుంటుంది. మనం విగ్రహానికి నేరుగా ఎదురుగా నిలబడితే, ఆ అత్యంత శక్తివంతమైన తరంగాలు నేరుగా మన శరీరంపై పడతాయి. అంతటి తీవ్రమైన శక్తిని మానవ దేహం తట్టుకోలేదనే ఉద్దేశంతోనే మనల్ని పక్కకు నిలబడమని చెబుతారు.

Standing Like This in a Temple? These Temple Rules Are a Must!

అర్చకులు, వాహన ప్రతిమల నియమం: మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, గర్భాలయంలోని మూలమూర్తికి కుడివైపున అర్చకులు ఉండి హారతి ఇస్తారు. ఆ హారతి మనకు స్పష్టంగా కనిపించాలంటే భక్తులు ఎడమపక్కన నిలబడటం మంచిది. ఇక అలాగే, ప్రధాన దైవానికి ఎదురుగా ఉండే నంది, గరుత్మంతుడు, హనుమంతుడు వంటి వాహన ప్రతిమలకు, స్వామికి మధ్యలో మనం అడ్డుగా నిలబడకూడదు. ఈ కారణం చేతనే పండితులు పక్కకు నిలబడాలని సూచిస్తుంటారు.

ఆలయంలో చేయకూడని సాధారణ తప్పులు: దేవాలయ ప్రాంగణంలోకి ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పులు వేసుకొని వెళ్ళకూడదు. అలాగే, మాంసాహార భోజనం తిన్న తర్వాత అస్సలు గుడికి వెళ్లరాదు.ఇక అన్నింటికంటే ముఖ్యంగా దేవుని పూజించే సమయంలో మనసును ఇటు అటు తిప్పకుండా, అన్యమనస్కంగా ఉండకుండా.. పూర్తి నమ్మకాన్ని, భక్తిని భగవంతునిపైనే లగ్నం చేసి దేవుని దర్శనం చేసుకోవాలి.

గుడికి వెళ్లడం ఎంత ముఖ్యమో, అక్కడ ఉండే సాంప్రదాయాలను, నియమాలను గౌరవించడం కూడా అంతే ముఖ్యం. ఇకపై మీరు దేవాలయానికి వెళ్లినప్పుడు దేవుడికి నేరుగా ఎదురుగా కాకుండా కాస్త పక్కకు నిలబడి దర్శనం చేసుకోండి. ఇక ఈ చిన్న చిన్న నియమాలను పాటించడం ద్వారా ఆలయంలోని పూర్తి సానుకూల శక్తి మీ సొంతమవుతుంది.

గమనిక: ఈ సమాచారం వాస్తు శాస్త్ర నిపుణుల సూచనలు మరియు ఆధ్యాత్మిక గ్రంథాల ఆధారంగా కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అందించబడింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Manalokam Telugu