Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రైల్వే టికెట్ బుకింగ్ రివల్యూషన్!.. ఇక సెకండ్స్‌లో టికెట్!

రైల్వే టికెట్ బుకింగ్ రివల్యూషన్!.. ఇక సెకండ్స్‌లో టికెట్!

ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవాలంటే చాలు.. అబ్బా! ఆ సర్వర్ ఎప్పుడు డౌన్ అవుతుందో అని టెన్షన్ పడని ప్రయాణికులు ఉండరు. ముఖ్యంగా తత్కాల్ ఓపెన్ అయినప్పుడు ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ హ్యాంగ్ అవ్వడం అందరికీ పెద్ద తలనొప్పి.

కానీ ఇకపై ఆ కష్టాలన్నీ తీరిపోనున్నాయి. భారతీయ రైల్వే ఒక సరికొత్త టెక్నాలజీతో టికెట్ బుకింగ్ సిస్టమ్‌ను పూర్తిగా మార్చేస్తోంది. ఆగస్టు 2026 నుంచి సెకన్ల వ్యవధిలోనే మీ టికెట్ మీ చేతికి వచ్చేలా ప్లాన్ చేస్తోంది.

పాత పద్ధతికి బై-బై.. కొత్త టెక్నాలజీకి వెల్‌కమ్: రైల్వే శాఖ ప్రస్తుతం ఉపయోగిస్తున్న ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ (PRS) దాదాపు 1986 నాటిది. అంటే 40 ఏళ్ల క్రితం నాటి పాత టెక్నాలజీ అన్నమాట. అందుకే ఇక ఇప్పుడు దీని స్థానంలో సరికొత్త క్లౌడ్ ఆధారిత టిక్కెట్ బుకింగ్ వ్యవస్థను తీసుకురావడానికి రైల్వే ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది.

ఐదు రెట్లు పెరగనున్న బుకింగ్ వేగం: ఈ కొత్త క్లౌడ్ సిస్టమ్ రావడం వల్ల టికెట్ బుకింగ్ వేగం ఊహించని రీతిలో ఐదు రెట్లు పెరగనుంది. ప్రస్తుత సర్వర్ స్లో సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. ఇక దీని ద్వారా నిమిషానికి ఏకంగా 1.5 లక్షల టిక్కెట్లను చాలా సులభంగా ప్రాసెస్ చేయవచ్చని రైల్వే అధికారులు చెబుతున్నారు.

తత్కాల్ కష్టాలకు శాశ్వత పరిస్కారం: ఉదయం 10 లేదా 11 గంటలకు తత్కాల్ బుకింగ్ ఓపెన్ చేయగానే పేజీ లోడ్ అవ్వడానికే నిమిషాల సమయం పట్టేది. ఈ లోపు సీట్లన్నీ అయిపోయేవి. ఇక కానీ ఈ కొత్త క్లౌడ్ టెక్నాలజీతో సర్వర్లు డౌన్ అయ్యే ఛాన్సే ఉండదు. ఎంత రద్దీ ఉన్నా సరే, క్షణాల్లో లాగిన్ అయి టికెట్ బుక్ చేసుకోవచ్చు.

Railway Ticket Booking Revolution!.. Get Your Ticket in Seconds!

అత్యాధునిక సౌకర్యాలు అందుబాటులోకి: కేవలం వేగం మాత్రమే కాదు, ప్రయాణికులకు నచ్చే మరికొన్ని ఫీచర్లు కూడా ఇందులో వస్తున్నాయి. సీట్ల ఎంపిక చాలా ఈజీగా మారుతుంది. ఇక అలాగే ఏ రోజు ఎంత ఛార్జీ ఉందో ముందే చూపే ‘ఛార్జీల క్యాలెండర్’ వంటి అధునాతన ఆప్షన్లు కూడా ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి.

టెక్నాలజీ పరంగా భారతీయ రైల్వే తీసుకుంటున్న ఈ నిర్ణయం ప్రయాణికులకు కొండంత ఊరటనిస్తుంది. ఇక పాత కాలపు సిస్టమ్ స్థానంలో రాబోతున్న ఈ ఆధునిక క్లౌడ్ బుకింగ్ వ్యవస్థ దేశంలో రైలు ప్రయాణాన్ని మరింత సులభతరం మరియు సౌకర్యవంతంగా మార్చబోతోంది.

గమనిక: ఈ సమాచారం రైల్వే శాఖ అధికారికంగా ప్రకటించిన ప్రణాళికల ఆధారంగా కేవలం అవగాహన కోసం అందించబడింది. కొత్త సిస్టమ్ అమలుకు సంబంధించిన మరిన్ని అప్‌డేట్ల కోసం అధికారిక రైల్వే వెబ్‌సైట్‌ను ఫాలో అవ్వండి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Manalokam Telugu