Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Sharwanand: ఇక ఆ యంగ్ హీరో ఆశలన్నీ ఆ సినిమాపైనే..!

Sharwanand: ఇక ఆ యంగ్ హీరో ఆశలన్నీ ఆ సినిమాపైనే..!

Sharwanand: శర్వానంద్.. విభిన్న పాత్రలు, కథలు ఎంచుకుంటూ తెలుగు ప్రేక్షకుల మదిలో ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. కానీ..

గత కొంత కాలంగా.. వరుస ప్లాపులతో కొట్టుమిట్టా డుతున్నారు. భూమి గుండ్రంగా తిరుగుతుంది అన్నట్టు.. తన కెరీర్ ఎక్కడ ప్రారంభించారో అక్కడికే వచ్చారు. కెరీర్ మొదట్లో వైవిధ్యమైన కథలను ఎంచుకుంటాడు.

కానీ, కమర్షియల్ హిట్ సాధించలేకపోతున్నారనే టాక్ వచ్చింది శర్వా మీద.. కానీ, రన్ రాజా రన్ హిట్ తో ఆయన దశ తిరిగింది. ఆ తర్వాత వరుస విజయాలు అందుకొన్నాడు. కమర్షియల్‌గా తన రేంజ్ 15 కోట్లకు పైగా పెంచుకున్నాడు. శతమానం భవతి సినిమాతో శర్వానంద్ తన బ్రాండ్ విలువ అమాంతం పెరిగింది. ఏకంగా 33 కోట్లకి పైగా షేర్ వసూలు చేశాడు.

ఏమైందో తెలియదు.. అప్పటి నుంచి ఇప్పటి వరకు శర్వా తన కెరీర్‌లో సూపర్ హిట్ లేదు. మధ్యలో విడుదలైన చాలా సినిమాలు అట్టర్ ఫ్లాప్‌గా నిలిచాయి. అంచనాలను అందుకోలేక బాక్స్ ఆఫీస్ వద్ద
చతికిలపడ్డాయి. భారీ అంచనాలతో విడుదలైన జానూ, రణరంగం, శ్రీకారం లాంటి సినిమాలు కూడా ఘోర పరాజయాన్ని మూట గట్టుకున్నాయి.

అయినా.. వరుస పెట్టి సినిమాలు చేస్తున్నే ఉన్నారు శర్వానంద్. తాజాగా అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కించిన మహా సముద్రం నటించారు. ఈ సినిమా దసరా కానుకగా విడుదలైంది. ఈ మల్టీ స్టారర్ తెరకెక్కిన ఈ చిత్రంపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఈ సినిమా కూడా నిరాశ పరిచింది. తొలి రోజు సినిమాకు నెగిటివ్ టాక్ రావడంతో కలెక్షన్లపై భారీ ప్రభావం పడింది. దీంతో ఇప్పుడు శర్వా కెరీర్ సందిగ్గదంలో పడింది.

పరాజయాలకు ఏ మాత్రం జంగకుండా.. మరో సినిమా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన ఓ కుటుంబ కథా చిత్రాన్ని చేస్తున్నారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ మీద కిషోర్ తిరుమల తెరకెక్కిస్తున్న చిత్రం ఆడవాళ్లు మీకు జోహార్లు. ఈ చిత్రంలో శర్వానంద్ పక్కన రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తున్నారు. దసరా కానుకగా ప్రజలందరికీ శుభాకాంక్షలు చెబుతూ ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు.

ఫ్యామిలీ ఎంటర్‌టైన్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై నే శర్వా నంద్ ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమా హిట్ పాట్ ల మీదనే ఆయన కెరీర్ ఆధారపడి ఉంది. ఫ్లాప్ అయితే.. ఆయన కెరీర్ దిగజారినట్లే. మరి ఇలాంటి సమయంలో శర్వానంద్ ఈ హిట్ కావడం చాలా అవసరం.

ఇవి కూడా చదవండి

  1. టాలీవుడ్ కు తెలంగాణ సర్కార్ శుభవార్త.. !
  2. Adallu Meeku Joharlu: “ఆడాళ్లు మీకు జోహార్లు” అంటున్న శర్వా .. ఫస్ట్ లూక్ అదుర్స్!
  3. Shakuntalam: శకుంతలం డబ్బింగ్ షూరూ! మరీ సమంత పరిస్థితేంటీ?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Manalokam Telugu