Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సీక్వెల్‌ను నమ్ముకుంటున్న ఓంకార్‌.. రాజుగారి గది సిరీస్ ఎఫెక్ట్‌!

సీక్వెల్‌ను నమ్ముకుంటున్న ఓంకార్‌.. రాజుగారి గది సిరీస్ ఎఫెక్ట్‌!

రాజుగారి గది సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. అప్పట్లో ఈ సినిమా పెద్ద సంచలనమే అని చెప్పాలి. దయ్యం కథతో ఓంకార్ తీసిన ఈ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టించింది. అయితే దీనికి సీక్వెల్‌గా రాజుగారి గది-2 తీసాడు ఓంకార్‌. ఆ మూవీ కూడా పెద్ద హిట్ అయింది. ఇక అంతే ఆ జోష్‌తో రాజుగారి గది-3 సినిమాను తీశాడు. కానీ ఇది పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.

ఇక్కడ ట్విస్టు ఏంటంటే.. రాజుగారి గది సిరీస్ అన్నింట్లోనూ ఓంకార్ తమ్ముడు అయిన అశ్విన్ హీరోగా చేస్తున్నాడు. అయితే రాజుగారి గది సిరీస్‌కు మాత్రం క్రేజ్ ఇంకా అలాగే ఉంది. ఒక్క సినిమా ప్లాప్ అయినా దాని ఇంపాక్ట్ మాత్రం తగ్గలేదనే చెప్పాలి.

అయితే దీన్ని క్యాష్ చేసుకునేందుకు ఓం కార్ మరో ప్లాన్ వేశాడు.

ఇప్పుడు రాజుగారి గది-4 సినిమా తీసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. కాగా ఇందులో కూడా అశ్విన్ హీరోగా చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కథ కూడా రెడీ చేస్తున్నారంట. ఇప్పుడు ఓంకార్ మాటీవీలో ఓ ప్రోగ్రామ్ చేస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమాపై అధికారిక ప్రకటన కూడా వస్తుందని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

  1. టాలీవుడ్ బాట పడుతున్న కియారా.. కొరటాల వదలట్లేదుగా!
  2. నిర్మాత అవతారం ఎత్తబోతున్న నమ్రత.. మహేశ్ అండగా!
  3. ఆచార్య విషయంలో త్వరలోనే సర్‌ప్రైజ్‌.. కొరటాలకు మెగాస్టార్ ఆర్డర్‌!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Manalokam Telugu