Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఉద్యోగులు ఫిట్‌గా ఉంటే చాలు.. డబ్బులు ఇచ్చే కంపెనీ ఆఫర్‌ ఇదే!

ఉద్యోగులు ఫిట్‌గా ఉంటే చాలు.. డబ్బులు ఇచ్చే కంపెనీ ఆఫర్‌ ఇదే!

రోజంతా ఆఫీస్ పని, లాప్‌టాప్‌ల ముందు కూర్చోవడంతో వ్యాయామం చేయడానికి సమయమే ఉండటం లేదని చాలామంది ఉద్యోగులు బాధపడుతుంటారు. అయితే, ఉద్యోగులు ఫిట్‌గా ఉంటే చాలు, రివార్డులు, క్యాష్ ప్రైజులు ఇస్తామంటూ దక్షిణ కొరియాలోని ఒక కంపెనీ క్రేజీ ఆఫర్ ప్రకటించింది.

ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో మన దగ్గర కూడా ఇలాంటి ఆఫర్లు వస్తే ఎంత బాగుండో అని ఐటీ, ప్రైవేట్ ఉద్యోగులు ఆశపడుతున్నారు..

దక్షిణ కొరియా కంపెనీ క్రేజీ కాన్సెప్ట్: దక్షిణ కొరియాకు చెందిన ఒక సంస్థ తమ కంపెనీలో పనిచేసే ఉద్యోగుల ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు రెండు నెలల ఫిట్‌నెస్ ఛాలెంజ్‌ను ప్రారంభించింది. ఇక ఈ నిర్దిష్ట సమయంలో క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ, ఆరోగ్యకరమైన అలవాట్లను పాటించే ఉద్యోగులకు కంపెనీ ప్రత్యేకంగా రివార్డులను అందిస్తోంది. ఈ విషయాన్ని అక్కడ పనిచేస్తున్న ఒక భారతీయ ఉద్యోగి సోషల్ మీడియాలో పంచుకోవడంతో వెలుగులోకి వచ్చింది.

Stay Fit and Get Paid: This Company Offers Employees a Unique Wellness Perk

మన దేశంలోనూ ఇలాంటివి వస్తే ఎలా ఉంటుంది?: మన దగ్గర చాలామంది ఉద్యోగులు ఉదయం నుంచి రాత్రి వరకు ఆఫీస్ పనుల్లో మునిగిపోయి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. ఇక గంటల తరబడి ఒకే చోట కూర్చోవడం వల్ల నడుము నొప్పులు, ఊబకాయం, బిపి, షుగర్ వంటి సమస్యలు చిన్న వయసులోనే చుట్టుముడుతున్నాయి. ఒకవేళ మన కంపెనీలు కూడా ఫిట్‌నెస్‌కు డబ్బులు లేదా రివార్డులు ఇచ్చే ఆఫర్లు పెడితే ఉద్యోగులకు పనితో పాటు ఆరోగ్యంపై కూడా శ్రద్ధ పెరుగుతుంది.

కంపెనీలకు మరియు ఉద్యోగులకు డబుల్ బెనిఫిట్: ఉద్యోగులు ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉంటే ఆఫీసుల్లో వారి పనితీరు మరియు ప్రొడక్టివిటీ ఆటోమేటిక్‌గా పెరుగుతుంది. ఇక వర్క్ స్ట్రెస్ తగ్గి మైండ్ రిలాక్స్‌గా ఉంటుంది. దీనివల్ల ఉద్యోగులకు ఆరోగ్యంతో పాటు రివార్డులు లభిస్తాయి, కంపెనీలకు కూడా మెరుగైన ఫలితాలు వస్తాయి.

ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. కేవలం జీతం కోసమే కాకుండా మన ఆరోగ్యం కోసం కూడా రోజూ కాసేపు వ్యాయామానికి సమయం కేటాయించడం చాలా ముఖ్యం. మన దేశంలో కూడా కంపెనీలు ఇలాంటి ‘వెల్నెస్ కల్చర్’ను ప్రోత్సహిస్తే ఉద్యోగుల జీవితాల్లో నిజమైన మార్పు వస్తుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Manalokam Telugu