Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉందా? ఈ 5 ఇంటి పానీయాలు ఆరోగ్యానికి మేలు చేయొచ్చు!

యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉందా? ఈ 5 ఇంటి పానీయాలు ఆరోగ్యానికి మేలు చేయొచ్చు!

రీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరిగితే జాయింట్స్‌లో క్రిస్టల్స్ పేరుకుపోయి తీవ్రమైన కీళ్ల నొప్పులు, 'గౌట్' సమస్యకు దారితీస్తాయి. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ఇది హైపర్ టెన్షన్ (అధిక రక్తపోటు) వంటి సమస్యలకు కూడా కారణమవుతుంది.

అయితే, దీనిని తగ్గించుకోవడానికి మన ఇంటి వంటగదిలోనే కొన్ని సహజమైన పానీయాలు అందుబాటులో ఉన్నాయి. యూరిక్ యాసిడ్‌ను అదుపులో ఉంచే ఆ 4 హెల్తీ డ్రింక్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం..

కొబ్బరి నీళ్లు: కొబ్బరి బొండాం నీళ్లు శరీరానికి మేలు చేసే అద్భుతమైన సహజ పానీయం. ఇందులో పొటాషియం, ఎలక్ట్రోలైట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇక ఇవి శరీరంలో పేరుకుపోయిన అదనపు యూరిక్ యాసిడ్‌ను బయటకు పంపి, కిడ్నీల పనితీరును మెరుగుపరుస్తాయి. తీపి కూల్ డ్రింక్స్‌కు బదులుగా కొబ్బరి నీళ్లు తాగడం వల్ల శరీరం హైడ్రేటెడ్‌గా కూడా ఉంటుంది.

బార్లీ నీళ్లు: యూరిక్ యాసిడ్ సమస్యకు బార్లీ నీళ్లు పూర్వం నుంచీ ఉపయోగిస్తున్న బెస్ట్ హోమ్ రెమిడీ. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉండి, మెటబాలిక్ రేటును పెంచుతుంది. ఇక బార్లీ నీళ్లను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల యూరిక్ యాసిడ్ స్థాయిలు సహజంగానే తగ్గుముఖం పడతాయి.

5 Natural Drinks That May Support Healthy Uric Acid Levels

మజ్జిగ: మధ్యాహ్న భోజనంలో కమ్మని మజ్జిగ తీసుకోవడం మన సంప్రదాయం. మజ్జిగలో కొవ్వు శాతం చాలా తక్కువగా ఉంటుంది. ఇక ఇది జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడమే కాకుండా, శరీరానికి మంచి హైడ్రేషన్‌ను ఇస్తూ యూరిక్ యాసిడ్‌ను తగ్గించడంలో ఎంతో సహాయపడుతుంది.

ఉసిరి రసం & నిమ్మరసం: ఉసిరి మరియు నిమ్మకాయల్లో విటమిన్ 'సి' తో పాటు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇక ఉసిరి రసం తాగడం వల్ల ఇమ్యూనిటీ పెరగడంతో పాటు యూరిక్ యాసిడ్ తగ్గుతుంది. అలాగే నిమ్మరసం జీర్ణమయ్యే క్రమంలో ఆల్కలైన్‌గా మారి యూరిక్ యాసిడ్ తీవ్రతను తగ్గించడంలో సహాయపడుతుంది.

ఇక శరీరంలో యూరిక్ యాసిడ్ నియంత్రణలో ఉండాలంటే సరైన జీవనశైలితో పాటు ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవడం చాలా ముఖ్యం. మన ఇంట్లో దొరికే ఈ సహజ పానీయాలను రోజువారీ డైట్‌లో భాగం చేసుకోవడం వల్ల కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చు.

గమనిక: ఈ సమాచారం సాధారణ అవగాహన కోసం మాత్రమే అందించబడింది. యూరిక్ యాసిడ్ లేదా కీళ్ల నొప్పులు తీవ్రంగా ఉన్నట్లయితే వైద్యులను సంప్రదించి తగిన చికిత్స పొందడం శ్రేయస్కరం.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Manalokam Telugu