Dailyhunt
Gold Rates: మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్లో తులం ఎంతంటే?

Gold Rates: మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్లో తులం ఎంతంటే?

Gold Rates : ఇండియాలో భారీగా బంగారం పెరుగుతున్న సమయంలో బంగారం కొనుగోలు చేసేటువంటి మగువలకు గుడ్ న్యూస్ అందింది. నిన్న స్థిరంగా ఉన్న బంగారం ధరలు…ఇవాళ కూడా కాస్త తగ్గాయి.

బంగారం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. బంగారం…ప్రపంచంలోనే అత్యంత విలువైన వస్తువు. ఇక మన దేశంలో అయితే.. దీనికి ఉన్న డిమాండ్‌ మరీ ఎక్కువే. ఏ చిన్న పండగ జరిగినా… బంగారం, వెండి కొనుగోలు చేయడానికి మహిళలు చాలా ఆసక్తి చూపుతారు.

gold and silver rates on febuary 13th

ఇది ఇలా ఉండగా తాజాగా బంగారం ధరలు భారీగా తగ్గాయి. హైదరాబాద్ నగరంలో బంగారం ధరల వివరాల్లోకి వెళితే… హైదరాబాద్ మార్కెట్‌ లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 10 తగ్గి, రూ. 62, 940 గా నమోదు కాగా.. అదే సమయం లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 10 తగ్గి, రూ. 57, 690 గా పలుకుతుంది. ఇక వెండి ధరలు కూడా కాస్త పెరుగుదల నమోదు అయ్యాయి. దీంతో కేజీ వెండి ధర రూ. 100 పెరిగి రూ. 77, 100 గా నమోదు అయింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Manalokam Telugu