Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఐటీఐ,డిగ్రీ అర్హతతో.. 6565 ఆర్‌ఆర్‌బీ టెక్నీషియన్ పోస్టులు

ఐటీఐ,డిగ్రీ అర్హతతో.. 6565 ఆర్‌ఆర్‌బీ టెక్నీషియన్ పోస్టులు

Merupulu 1 week ago

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ .. 2026-27 ఏడాదికి గానూ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి షార్ట్ నోటిఫికేషన్ (CEN No. 02/2026) విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 6,565 పోస్టులను భర్తీ చేయనున్నారు.

ఇందులో టెక్నీషియన్ గ్రేడ్-I సిగ్నల్, అలాగే వివిధ రకాల టెక్నీషియన్ గ్రేడ్-III పోస్టులు ఉన్నాయి. పోస్టులను బట్టి విద్యార్హతలు నిర్ణయించారు. జూన్ 30 వ తేదీ నుంచి జులై 29 వరకు అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వ్రాత పరీక్ష,డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా అభ్యర్థును ఎంపిక చేస్తారు ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన మరిన్ని వివరాలు.

నోటిఫికేషన్ వివరాలు:

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 6,565 ఖాళీలను భర్తీ చేయనున్నారు. పోస్టుల వారీగా వివరాలు..

టెక్నీషియన్ గ్రేడ్-I సిగ్నల్ (Level 5): 323 పోస్టులు

టెక్నీషియన్ గ్రేడ్-III (Level 2): 6,242 పోస్టులు

ఎవరు అర్హులు?

ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలంటే పోస్టును బట్టి కింది విద్యార్హతలు ఉండాలి.

టెక్నీషియన్ గ్రేడ్ I సిగ్నల్: అభ్యర్థులు ఫిజిక్స్ / ఎలక్ట్రానిక్స్ / కంప్యూటర్ సైన్స్ / ఐటీ / ఇన్‌స్ట్రుమెంటేషన్‌లో బీఎస్సీ పూర్తి చేసి ఉండాలి లేదా సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ డిగ్రీ లేదా డిప్లొమా పూర్తి చేసి ఉండాలి.

టెక్నీషియన్ గ్రేడ్ III: టెన్త్ పాస్ అవ్వడంతో పాటు సంబంధిత ట్రేడ్‌లో ITI (NCVT/SCVT) లేదా యాక్ట్ అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి.

వయస్సు :
గ్రేడ్-I పోస్టులు:అభ్యర్థుల వయస్సు 18 నుంచి 36 సంవత్సరాల మధ్య ఉండాలి.

గ్రేడ్-III: 18 నుంచి 33 సంవత్సరాల మధ్య ఉన్నవారు ఈ పోస్టులకు అర్హులు.

(ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC, ST, OBC, EWS, ఇతరులకు వయస్సులో సడలింపు ఉంటుంది).

సెలెక్షన్ ప్రాసెస్:
ఈ ఉద్యోగాలకు ఎలాంటి ఆప్టిట్యూడ్ టెస్ట్ (CBAT) ఉండదు. కేవలం మూడు స్టేజ్‌లలో సెలెక్షన్ పూర్తి చేస్తారు.

1.కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT)

2.డాక్యుమెంట్ వెరిఫికేషన్ (DV)

CBT పరీక్షా విధానం:
మొత్తం 100 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఉంటాయి. వీటికి 100 మార్కులు. ఎగ్జామ్ టైమ్ 90 నిమిషాలు ఉంటుంది. నెగెటివ్ మార్కింగ్ ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 1/3 వంతు మార్కు కట్ అవుతుంది.

ముఖ్యమైన తేదీలు:
ఈ ఉద్యోగాలకు ఆన్‌లైన్ ద్వారా మాత్రమే అప్లై చేసుకోవాలి.

అప్లికేషన్ ప్రారంభం: జూన్ 30వ తేదీ నుంచి అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.

చివరి తేదీ: జులై 29 (రాత్రి 11:59 గంటల) వరకు అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

అప్లికేషన్ విధానం:

1.మొదట ఆర్‌ఆర్‌బీ అధికారిక వెబ్‌సైట్ లోకి లాగిన్ అవ్వాలి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Merupulu