పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 270 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. టెన్త్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ పూర్తి చేసిన వారు ఈ పోస్టులకు అర్హులు.
ఎలాంటి రాత పరీక్ష,ఇంటర్వ్యూ లేకుండా మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 10 వరకు అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. పోస్టును బట్టి రూ.13,500 నుంచి రూ.17,500 వరకు స్టైపెండ్ లభిస్తుంది. ఈ పోస్టులకు అధికారిక వెబ్‌సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు
పోస్టుల వివరాలు, అర్హతలు:
దేశవ్యాప్తంగా మొత్తం 270 అప్రెంటిస్ శిక్షణ ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు.
ఐటీఐ-ఎలక్ట్రిషియన్: ఐటీఐ (ఎలక్ట్రిషియన్) పూర్తి చేసిన వారు.
డిప్లొమా (ఎలక్ట్రికల్/సివిల్): సంబంధిత బ్రాంచ్‌లో ఇంజనీరింగ్ డిప్లొమా పూర్తి చేసిన వారు.
గ్రాడ్యుయేట్ (ఎలక్ట్రికల్/సివిల్): బీఈ / బీటెక్ ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసిన వారు.
ముఖ్యమైన తేదీలు:
అప్లికేషన్లు ప్రారంభం: ఆగస్టు 25 నుంచి అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
చివరి తేదీ: సెప్టెంబర్ 10 వరకు అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
శిక్షణ కాలం: 1 సంవత్సరం
స్టైపెండ్ (జీతం) వివరాలు:
శిక్షణ సమయంలో అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం నెలవారీ స్టైపెండ్ లభిస్తుంది. ఐటీఐ ట్రేడ్ వారికి రూ.13,500, డిప్లొమా అభ్యర్థులకు రూ.15,000, గ్రాడ్యుయేట్ అభ్యర్థులకు రూ.17,500 వరకు స్టైపెండ్ చెల్లిస్తారు.
ఎంపిక విధానం:
ఈ పోస్టులకు ఎలాంటి రాత పరీక్ష ఉండదు. అభ్యర్థులు తమ అర్హత పరీక్షలో సాధించిన మార్కుల మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి, డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహించి అప్రెంటిస్‌గా ఎంపిక చేస్తారు. మరిన్ని వివరాలకు అధికారిక వెబ్ సైట్ సంప్రదించవచ్చు.

