ప్రముఖ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ నార్తర్న్ రీజియన్‌లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి అధికారిక నోటిఫికేషన్‌ను ఇటీవల విడుదల చేసిన విషయం తెలిసిందే.
అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా టెక్నీషియన్, గ్రాడ్యుయేట్ , ట్రేడ్ అప్రెంటిస్ విభాగాల్లో మొత్తం 433 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఎలాంటి రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ లేకుండా, కేవలం మెరిట్ మార్కుల ఆధారంగా ఈ ఉద్యోగాలకు ఎంపిక జరుగుతుంది. ఇంతవరకు అప్లై చేసుకోని అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు సెప్టెంబర్ 6 లోపు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు.
పోస్టుల వివరాలు ,విద్యార్హతలు:
ఈ నోటిఫికేషన్ ద్వారా టెక్నీషియన్, ట్రేడ్ , గ్రాడ్యుయేట్ , డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు.
టెక్నీషియన్ అప్రెంటిస్: సంబంధిత ఇంజనీరింగ్ విభాగంలో (మెకానికల్,ఎలక్ట్రికల్,సివిల్ తదితర) మూడేళ్ల రెగ్యులర్ డిప్లొమా పూర్తి చేసి ఉండాలి.
ట్రేడ్ అప్రెంటిస్ : టెన్త్ తో పాటు సంబంధిత ట్రేడ్‌లో రెండేళ్ల ఐటీఐ (NCVT/SCVT) సర్టిఫికేట్ కలిగి ఉండాలి.
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ (BA, B.Sc, B.Com, BBA) పూర్తి చేసిన వారు అర్హులు.
డేటా ఎంట్రీ ఆపరేటర్: ఇంటర్ పాస్ అయిన వారు లేదా తగిన స్కిల్ సర్టిఫికేట్ ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు.
వయోపరిమితి:
అప్లై చేసుకునే అభ్యర్థుల వయస్సు 18 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు వయస్సులో సడలింపు లభిస్తుంది. అప్రెంటిస్ శిక్షణ కాలంలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం నెలవారీ స్టైపెండ్‌తో పాటు అదనపు అలవెన్సులు అందజేస్తారు.
ఎంపిక విధానం:
ఈ రిక్రూట్మెంట్‌లో ఎలాంటి రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ ఉండదు. అభ్యర్థులు తమ అర్హత పరీక్షలో సాధించిన మార్కుల మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ నిర్వహించి ఫైనల్ లిస్ట్ తయారు చేస్తారు.
అప్లై చేయడం ఎలా?
అర్హత కలిగిన అభ్యర్థులు NAPS లేదా NATS అధికారిక పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకొని అప్లై చేయాల్సి ఉంటుంది. మరిన్ని వివరాలకు అధికారిక వెబ్ సైట్ సంప్రదించవచ్చు.
అప్లికేషన్లకు చివరి తేదీ:
సెప్టెంబర్ 6 (సాయంత్రం 5:00 గంటల వరకు) మాత్రమే అప్లికేషన్లకు అవకాశం ఉంది.

