Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బీఈఎంఎల్‌లో 1346 అప్రెంటిస్ పోస్టులు..వెంటనే అప్లై చేయండి!

బీఈఎంఎల్‌లో 1346 అప్రెంటిస్ పోస్టులు..వెంటనే అప్లై చేయండి!

Merupulu 1 hr ago

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని..బీఈఎంఎల్ లిమిటెడ్ భారీ స్థాయిలో.. అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.ఈ నోటిఫికేషన్ ద్వారా కాంట్రాక్ట్ పద్దతిలో..

ఏడాది పాటు శిక్షణ ఇచ్చేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌ లైన్ అప్లికేషన్లకు ఆహ్వానిస్తోంది. మొత్తం 1,346 అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. బెంగళూరు (400), మైసూర్ (227), కెజిఎఫ్ (608), పాలాక్కాడ్ (111) కాంప్లెక్స్‌లలో ఈ శిక్షణ అందుబాటులో ఉంటుంది. ఐటీఐ ,డిప్లొమా, గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ట్రేడ్ అప్రెంటిస్ (ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, టర్నర్, వెల్డర్, మిషినిస్ట్ మొదలైనవి), డిప్లొమా, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్, జనరల్ గ్రాడ్యుయేట్ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.

విద్యార్హతలు:
అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగాలు.. లేదా ట్రేడ్‌లలో పూర్తి స్థాయి రెగ్యులర్ కోర్సును.. పూర్తి చేసి ఉండాలి. అప్లికేషన్ తేదీ నాటికి గత 3 సంవత్సరాల లోపు ఉత్తీర్ణులైన వారు మాత్రమే అప్లై చేయడానికి అర్హులు. గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్, జనరల్ గ్రాడ్యుయేషన్ (3 సంవత్సరాల బీఎస్సీ, బీకాం, బీసీఏ, బీబీఏ), 3 సంవత్సరాల డిప్లొమా, సంబంధిత ట్రేడ్‌లలో.. (ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, టర్నర్, వెల్డర్ మొదలైనవి) ఐటీఐ కోర్సులు చేసిన వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. అయితే.. పార్ట్ టైమ్, డిస్టెన్స్ లేదా ఓపెన్ లెర్నింగ్, కరెస్పాండెన్స్ , ఆన్‌ లైన్ మోడ్‌లో చదివిన వారు, ఇంకా రిజల్ట్ కోసం ఎదురుచూస్తున్న వారు, అలాగే ఇదివరకే అప్రెంటిస్‌ షిప్ చేసినవారు ఈ పోస్టులకు అనర్హులు.

వయోపరిమితి:
అప్లై చేసుకునే నాటికి అభ్యర్థికి కనీసం 17 సంవత్సరాల వయస్సు నిండి ఉండాలి. 17 సంవత్సరాల కంటే.. తక్కువ వయస్సు ఉన్నవారు అప్లై చేయడానికి అర్హులు కారు.

స్టైపెండ్ వివరాలు:
ఎంపికైన అభ్యర్థులకు ఒక సంవత్సరం శిక్షణా కాలంలో.. వారి విద్యార్హత ఆధారంగా.. ప్రతి నెల స్టైపెండ్ చెల్లిస్తారు. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లకు (టెక్నికల్ & జనరల్) నెలకు రూ.12,300, డిప్లొమా అభ్యర్థులకు రూ.10,900, ఐటీఐ అభ్యర్థులకు వారు ఎంచుకున్న ట్రేడ్‌ను బట్టి నెలకు రూ.9,600 లేదా రూ.10,560 చొప్పున లభిస్తుంది.

ఎంపిక విధానం, అప్లికేషన్ ఫీజు:
ఈ భర్తీ ప్రక్రియకు అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. అలాగే.. ఎలాంటి రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూలు నిర్వహించకుండా.. అభ్యర్థులు తమ క్వాలిఫైయింగ్ పరీక్షల్లో.. సాధించిన మార్కుల శాతం ఆధారంగా మెరిట్ లిస్ట్ రూపొందిస్తారు. ఆ తర్వాత ప్రతి పోస్టుకు 1:5 నిష్పత్తిలో.. అభ్యర్థులను డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కు పిలుస్తారు. సీజీపీఏ ఉన్న వారు తప్పని సరిగా తమ కాలేజీ లేదా యూనివర్సిటీ జారీ చేసిన పర్సంటేజ్ కన్వర్షన్ సర్టిఫికేట్‌ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.

అప్లై చేసుకునే విధానం:
ఆసక్తి ఉన్న అభ్యర్థులు అప్లికేషన్ రెండు దశల్లో పూర్తి చేయాలి. మొదటి దశలో భాగంగా, ఐటీఐ అభ్యర్థులు NAPS పోర్టల్‌లో (apprenticeshipindia.gov.in), డిగ్రీ లేదా డిప్లొమా అభ్యర్థులు NATS పోర్టల్‌లో (nats.education.gov.in) వివరాలు ఎంటర్ చేసుకుని తమ ప్రొఫైల్‌ను 100% పూర్తి చేయాలి. ఆ తర్వాత రెండవ దశలో, ఆ పోర్టల్స్ ద్వారా వచ్చిన ఎన్‌రోల్‌మెంట్ నంబర్‌తో BEML అధికారిక వెబ్‌సైట్ (recruitment.bemlindia.in) లోకి లాగిన్ అయ్యి, 'Apprentices' విభాగంలో రిజిస్టర్ చేసుకోవాలి. తర్వాత వ్యక్తిగత, విద్యా వివరాలు, DBT-యాక్టివేటెడ్ బ్యాంక్ అకౌంట్ వివరాలు ఎంటర్ చేసి, అవసరమైన సర్టిఫికెట్లు, ఫోటో, సంతకం అప్‌లోడ్ చేసి ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Merupulu