Dailyhunt
బ్యాంక్ ఆఫ్ బరోడాలో మేనేజర్ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో మేనేజర్ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే!

Merupulu 2 weeks ago

బ్యాంక్ ఆఫ్ బరోడా నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. వివిధ ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ పోస్టులతో పాటు మరికొన్ని ఇతర భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఈ నోటిఫికేషన్ ద్వారా 104 పోస్టులను భర్తీ చేయనున్నారు. డిగ్రీ పూర్తి చేసిన వారు ఈ ఉద్యోగాలకు అర్హులు. పోస్టును బట్టి కనీసం 2 నుంచి 5 ఏళ్ల అనుభవం తప్పనిసరి. ఏప్రిల్ 16 వరకు అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

పోస్టుల వివరాలు:
మొత్తం పోస్టులు - 104
విభాగాల వారిగా..

డిప్యూటీ మేనేజర్
అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్
ఇతర పోస్టులు

అర్హతలు:
ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో డిగ్రీ లేదా పీజీ (MBA/CA/CFA/ICWA) ఉత్తీర్ణులై ఉండాలి. పోస్టును బట్టి కనీసం 2 నుంచి 5 ఏళ్ల వరకు బ్యాంకింగ్ లేదా ఫైనాన్స్ రంగంలో అనుభవం అవసరం.

వయస్సు:
పోస్టుల ఆధారంగా వయస్సు మారుతుంది. సాధారణంగా 25 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అర్హులు. రిజర్వేషన్ వర్గాలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉంటుంది.

అప్లికేషన్లకు చివరి తేదీ:
అభ్యర్థులు ఏప్రిల్ 16 వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.

అప్లికేషన్ ఫీజు:
ఓబీసీ,ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ. 850(GSTతో కలిపి) చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులు రూ. 175 చెల్లిస్తే సరిపోతుంది.

ఎంపిక విధానం:
అభ్యర్థులను షార్ట్ లిస్టింగ్ చేసిన తర్వాత.. పర్సనల్ ఇంటర్వ్యూ లేదా గ్రూప్ డిస్కషన్ ద్వారా ఎంపిక చేస్తారు. కొన్ని సందర్భాల్లో ఆన్‌లైన్ టెస్ట్ నిర్వహించే అవకాశం కూడా ఉంటుంది.

అప్లికేషన్ విధానం:
1.అభ్యర్థులు బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారిక వెబ్‌సైట్ https://bankofbaroda.bank.in లోకి లాగిన్ అవ్వాలి.

2.'Careers' విభాగంలో నోటిఫికేషన్‌ను క్లిక్ చేయాలి.

3.అర్హతలను చెక్ చేసి, ఆన్‌లైన్ ఫారమ్‌ పూర్తి చేయాలి.

4.అవసరమైన సర్టిఫికెట్లు అప్‌లోడ్ చేసి, ఫీజు చెల్లించాలి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Merupulu