Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బ్యాంక్ ఆఫ్ ఇండియాలో.. 779 క్రెడిట్ ఆఫీసర్ ఉద్యోగాలు

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో.. 779 క్రెడిట్ ఆఫీసర్ ఉద్యోగాలు

Merupulu 1 week ago

బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న క్రెడిట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిపకేషన్ ద్వారా 779 పోస్టులను భర్తీ చేయనున్నారు.

డిగ్రీ లేదా CA, CS, CFA వంటి ప్రొఫెషనల్ కోర్సులు పూర్తి చేసి, బ్యాంకింగ్ రంగంలో అనుభవం ఉన్న అభ్యర్థులకు ఇది ఒక అద్భుతమైన అవకాశం. ఆన్‌లైన్ అప్లికేషన్లు జూన్ 30 నుంచి ప్రారంభమయ్యాయి. కాగా అప్లికేషన్లకు చివరి తేదీ జూలై 20 వరకు ఉంది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఖాళీల వివరాలు:
మొత్తం 779 పోస్టులలో గత రిక్రూట్‌మెంట్ కింద మిగిలిపోయిన 475 బ్యాక్‌లాగ్ పోస్టులు కూడా ఉన్నాయి. గ్రేడ్ల వారీగా ఖాళీలు..

MMGS-II: 677 పోస్టులు

MMGS-III: 61 పోస్టులు

SMGS-IV: 41 పోస్టులు

అర్హత & వయస్సు (01 జూన్ 2026 నాటికి):
విద్యార్హత:
కనీసం 60% మార్కులతో (SC/ST/OBC/PWBD వారికి 55%) ఏదైనా డిగ్రీ లేదా CA/CS/ICWA/CFA ఉత్తీర్ణులై ఉండాలి.

అనుభవం: గ్రేడ్‌ను బట్టి ఆఫీసర్ కేడర్‌లో కనీసం 3 నుంచి 7 సంవత్సరాల పోస్ట్-క్వాలిఫికేషన్ బ్యాంకింగ్/క్రెడిట్ అనుభవం తప్పనిసరి.

వయస్సు:MMGS-II కి 25-32 ఏళ్లు, MMGS-III కి 28-38 ఏళ్లు, SMGS-IV కి 32-45 ఏళ్ల మధ్య ఉండాలి. (ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC/STలకు 5 ఏళ్లు, OBCలకు 3 ఏళ్లు వయో సడలింపు ఉంటుంది).

జీతం:
ఎంపికైన అభ్యర్థులకు గ్రేడ్‌ను బట్టి బేసిక్ పే రూ.64,820 నుంచి ప్రారంభమై, అలవెన్సులతో కలిపి గరిష్టంగా రూ.1,20,940 వరకు లభిస్తుంది.

ఎంపిక విధానం:
అభ్యర్థులను ఆన్‌లైన్ పరీక్ష (రాత పరీక్ష) , పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. రాత పరీక్షలో.. ఇంగ్లీష్ లాంగ్వేజ్ (25 మార్కులు - అర్హత మాత్రమే) , ప్రొఫెషనల్ నాలెడ్జ్ (100 మార్కులు) ఉంటాయి. నెగెటివ్ మార్కింగ్ (1/4th) కూడా ఉంటుంది.

ఎలా అప్లై చేయాలి?
బ్యాంక్ అఫీషియల్ వెబ్‌సైట్ www.bankofindia.bank.in లోని 'Career' సెక్షన్‌కు వెళ్లి ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేసుకోవాలి. జనరల్ అభ్యర్థులకు ఫీజు రూ.850 కాగా.. ఎస్సీ, ఎస్టీ,పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.175 గా నిర్ణయించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Merupulu