తెలంగాణ రాష్ట్ర ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీ (ESD) విభాగం అభ్యర్థుల సౌకర్యం కోసం మరో వినూత్న ముందడుగు వేసింది. డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (DEECET) 2026 హాల్ టికెట్లను మీసేవ వాట్సాప్ చాట్‌బాట్ ద్వారా అందుబాటులోకి తీసుకువచ్చింది.
మే 15(రేపు) ఉదయం 10 గంటల నుంచి అభ్యర్థులు తమ మొబైల్ ద్వారానే హాల్ టికెట్లను సులభంగా పొందవచ్చు.
ఈ నెల 21, 22 తేదీల్లో పరీక్షలు జరగనున్న నేపథ్యంలో.. ఈ సదుపాయం లక్షలాది మంది అభ్యర్థులకు ఎంతో ఊరటనివ్వనుంది. ఇప్పటికే పలు సేవలను వాట్సాప్ ద్వారా అందిస్తున్న ESD విభాగం, ఇప్పుడు డీఈఈసెట్ హాల్ టికెట్లను కూడా ఈ జాబితాలో చేర్చింది.
ముఖ్యమైన తేదీలు:
హాల్ టికెట్లు డౌన్ లోడ్: మే 15( రేపు ఉదయం 10 గంటలు)నుంచి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
పరీక్ష తేదీలు: మే 21, 22 తేదీల్లో పరీక్షలు జరగనున్నాయి.
వాట్సాప్ ద్వారా హాల్ టికెట్ పొందే విధానం:
విద్యార్థులు నెట్ సెంటర్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా.. స్మార్ట్‌ఫోన్ ద్వారానే ఈ కింది పద్ధతిలో హాల్ టికెట్ పొందవచ్చు.
2. తర్వాత వాట్సాప్ ఓపెన్ చేసి సదరు నంబర్‌కు "Hi" అని మెసేజ్ పంపండి.
3. తిరుగు సమాధానంగా వచ్చే ఆప్షన్లలో లేదా నేరుగా "DEECET Hall Ticket" అని టైప్ చేయండి.
.

