Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
డిగ్రీ,బీటెక్ అర్హతతో ఎయిర్‌ఫోర్స్ ఆఫీసర్ పోస్టులు.. వెంటనే అప్లై చేయండి

డిగ్రీ,బీటెక్ అర్హతతో ఎయిర్‌ఫోర్స్ ఆఫీసర్ పోస్టులు.. వెంటనే అప్లై చేయండి

Merupulu 4 days ago

భారత వైమానిక దళంలో (Indian Air Force) కెరీర్ ప్రారంభించాలనుకునే అభ్యర్థులకు గుడ్ న్యూస్. ఫ్లయింగ్ బ్రాంచ్, గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్ & నాన్-టెక్నికల్) విభాగాలలో ఖాళీగా ఉన్న 379 గ్రూప్ 'A' గెజిటెడ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి సంబంధించి AFCAT 02/2026 అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది.

జులై 2027 లో ప్రారంభమయ్యే కోర్సుల కోసం పురుషులు, మహిళా అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతున్నారు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన అర్హతలు, ముఖ్యమైన తేదీలు, ఖాళీల వివరాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

IAF AFCAT 02/2026 రిక్రూట్‌మెంట్ పూర్తి వివరాలు:
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని వైమానిక దళంలో పర్మనెంట్ కమిషన్ (PC), షార్ట్ సర్వీస్ కమిషన్ (SSC) కింద ఈ నియామకాలు జరుగుతున్నాయి.

ఆన్‌లైన్ అప్లికేషన్ల ప్రారంభ తేదీ: మే 20 నుంచి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

చివరి తేదీ: జూన్ 19 (రాత్రి 11:30) వరకు అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.

అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ తేదీ: ఆగస్టు 4నుంచి అడ్మిట్ కార్డులు అందుబాటులో ఉంచుతారు.

ఆన్‌లైన్ కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) తేదీ: ఆగస్టు 8న సీబీటీ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు.

మొత్తం ఖాళీల వివరాలు:
మొత్తం 379 ఖాళీలను వివిధ విభాగాల వారీగా కేటాయించారు.

ఫ్లయింగ్ బ్రాంచ్ : పురుషులకు , మహిళలకు కలిపి మొత్తం 35 షార్ట్ సర్వీస్ కమిషన్ ఖాళీలు ఉన్నాయి.

గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్ - Technical): ఏరోనాటికల్ ఇంజనీర్ (ఎలక్ట్రానిక్స్ & మెకానికల్) విభాగంలో పర్మనెంట్ కమిషన్, షార్ట్ సర్వీస్ కమిషన్ కింద అత్యధిక ఖాళీలు ఉన్నాయి.

గ్రౌండ్ డ్యూటీ (నాన్-టెక్నికల్ - Non-Technical): వెపన్ సిస్టమ్స్ (WS), అడ్మినిస్ట్రేషన్, లాజిస్టిక్స్, అకౌంట్స్, ఎడ్యుకేషన్, మెటియోరాలజీ విభాగాల్లో ఖాళీలు కలవు.

NCC స్పెషల్ ఎంట్రీ & GATE స్కోర్ ఎంట్రీ: వీరికి రాత పరీక్ష నుంచి మినహాయింపు ఉంటుంది. వీరు నేరుగా AFSB ఇంటర్వ్యూకి హాజరు కావచ్చు.

అర్హత ప్రమాణాలు:
ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు భారతీయ పౌరుడై ఉండాలి. అంతే కాకుండా అవివాహితులై ఉండాలి.

వయస్సు:
ఫ్లయింగ్ బ్రాంచ్: 20 నుంచి 24 సంవత్సరాలు (అనగా 02 జూలై 2003- 01 జూలై 2007 మధ్య జన్మించి ఉండాలి). DGCA జారీ చేసిన కమర్షియల్ పైలట్ లైసెన్స్ ఉన్నవారికి 26 సంవత్సరాల వరకు సడలింపు ఉంటుంది.

గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్ & నాన్-టెక్నికల్): 20 నుంచి 26 సంవత్సరాలు (అనగా 02 జూలై 2001, 01 జూలై 2007 మధ్య జన్మించి ఉండాలి).

విద్యార్హతలు:
ఫ్లయింగ్ బ్రాంచ్ & వెపన్ సిస్టమ్స్:
10+2 స్థాయిలో మ్యాథ్స్, ఫిజిక్స్ ఉత్తీర్ణతతో పాటు ఏదైనా విభాగంలో కనీసం 3 ఏళ్ల డిగ్రీ లేదా 4 ఏళ్ల బీఈ, బీటెక్ పూర్తి చేసి ఉండాలి.

గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్): 10+2 లో ఫిజిక్స్, మ్యాథ్స్ తో పాటు నోటిఫికేషన్‌లో పేర్కొన్న ఇంజనీరింగ్ స్ట్రీమ్స్‌లో (ఎలక్ట్రానిక్స్/మెకానికల్/కంప్యూటర్ సైన్స్/ఐటీ మొదలైనవి) 4 ఏళ్ల డిగ్రీ కలిగి ఉండాలి.

ఇతర నాన్-టెక్నికల్ పోస్టులు: అకౌంట్స్ పోస్టులకు B.Com/BBA/BMS, ఎడ్యుకేషన్ పోస్టులకు పీజీ అర్హత ఉండాలి. ఫైనల్ ఇయర్ చదువుతున్న అభ్యర్థులు కూడా 30 మే 2027 నాటికి పాస్ సర్టిఫికేట్ సమర్పించగలరనే నిబంధనతో అప్లై చేసుకోవచ్చు.

అప్లై చేసుకునే విధానం:
అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు కేవలం ఆన్‌లైన్ విధానంలోనే అప్లై చేసుకోవాలి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Merupulu