Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఈఏపీసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల

ఈఏపీసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల

Merupulu 6 days ago

రాష్ట్రంలో ప్రొఫెషనల్ కోర్సుల అడ్మిషన్లకు సంబంధించి బైపీసీ విద్యార్థులకు విద్యాశాఖ ముఖ్యమైన ప్రకటన విడుదల చేసింది. ఫార్మసీ, ఫార్మ్-డి, బయోటెక్నాలజీ, బయోమెడికల్, ఫార్మాస్యూటికల్ ఇంజనీరింగ్ కోర్సుల భర్తీకి ఈఏపీసెట్-2026 కౌన్సెలింగ్ షెడ్యూల్ ఖరారైంది.

అర్హులైన అభ్యర్థులు నిర్ణీత గడువులోగా ఆన్‌లైన్ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులు కోరారు.

తొలి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ సెప్టెంబర్ 12న ప్రారంభం కానుంది. కాగా.. అభ్యర్థులు సెప్టెంబర్ 12 నుంచి 16 వరకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవడంతో పాటు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. ఆ తర్వాత సెప్టెంబర్ 15 నుంచి 17 మధ్య సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ పూర్తయిన వారు సెప్టెంబర్ 16 నుంచి 18 వరకు వెబ్ ఆప్షన్లు ఎంటర్ చేసుకోవడానికి అవకాశం కల్పించారు. తొలి విడత సీట్ల కేటాయింపును సెప్టెంబర్ 21న.. ప్రకటిస్తారు. అలా సీట్లు పొందిన విద్యార్థులు సెప్టెంబర్ 21, 22 తేదీల్లోగా నిర్దేశిత ఫీజు చెల్లించి ఆన్‌లైన్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.

తొలి విడతలో సీటు రాని వారి కోసం సెప్టెంబర్ 25 నుంచి ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ ప్రక్రియ మొదలవుతుంది. సెప్టెంబర్ 25న రిజిస్ట్రేషన్, స్లాట్ బుకింగ్ ముగిశాక, సెప్టెంబర్ 26న సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుంది. అభ్యర్థులు సెప్టెంబర్ 26, 27 తేదీల్లో కొత్తగా వెబ్ ఆప్షన్లు ఎంచుకోవాలి. ఫస్ట్ ఫేజ్లో ఇచ్చిన వెబ్ ఆప్షన్లు ఫైనల్ ఫేజ్ లో పరిగణనలోకి తీసుకోరు.సెప్టెంబర్ 29 లోపు ఫైనల్ ఫేజ్ సీట్లను కేటాయిస్తారు. సీటు పొందిన అభ్యర్థులు సెప్టెంబర్ 29,30 తేదీల్లో ఫీజు చెల్లించి సెల్ఫ్ రిపోర్టింగ్ పూర్తి చేయాల్సి ఉంటుంది. అనంతరం సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 1 మధ్య సంబంధిత కాలేజీల్లో నేరుగా హాజరై అడ్మిషన్ ప్రక్రియ పూర్తి చేయాలి.

కాలేజీలు, కోర్సుల ఎంపిక విషయంలో విద్యార్థులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు వెల్లడించారు. అంతే కాకుండా.. సీటు వచ్చే అవకాశాలు మెరుగ్గా ఉండేందుకు.. వీలైనన్ని ఎక్కువ ఆప్షన్లు ఇచ్చుకోవడం మంచిదని సూచించారు. అడ్మిషన్లకు సంబంధించిన పూర్తి మార్గదర్శకాలు అక్టోబర్ 2లోపు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని వెల్లడించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Merupulu