ఎన్టీపీసీ.. గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ (NGEL) ఇంజనీర్, ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 147 పోస్టులను భర్తీ చేయనున్నారు.
పోస్టులను బట్టి విద్యర్హతలు నిర్ణయించారు. ఈ ఉద్యోగాలకు 35 సంవత్సరాల వయసు గల అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్ 7 లోపు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. జనరల్/ఓబీసీ అభ్యర్థులకు రూ. 500 ఫీజు ఉండగా, ఎస్సీ/ఎస్టీ/మహిళలకు మినహాయింపు ఉంది. ఆసక్తి గలవారు అధికారిక వెబ్‌సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.
ముఖ్యమైన తేదీలు, ఖాళీల వివరాలు:
ఈ నోటిఫికేషన్ ద్వారా సివిల్,ఎలక్ట్రికల్,మెకానికల్ ఇంజనీర్‌లతో పాటు హెచ్‌ఆర్, ఫైనాన్స్, సేఫ్టీ, సీఎస్‌ఆర్ , రాజ్‌భాష విభాగాలలో ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేస్తున్నారు.
మొత్తం 147 ఖాళీలలో ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్ విభాగాలకు తగినట్లుగా పోస్టులు కేటాయించారు. ఈ నియామకం ప్రారంభంలో 3 సంవత్సరాల ఫిక్స్డ్-టర్మ్ ప్రాతిపదికన ఉంటుంది. ఆ తర్వాత సంస్థ అవసరాలను బట్టి మరో 2 సంవత్సరాలు పొడిగించే అవకాశం ఉంది.
అప్లికేషన్ చివరి తేదీ: సెప్టెంబర్ 7 వరకు అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
విద్యార్హతలు:
ఇంజనీర్ పోస్టులు: సంబంధిత బ్రాంచ్‌లో కనీసం 65% మార్కులతో.. ఫుల్ టైమ్ BE/B.Tech/B.Sc. (Engg) పూర్తి చేసి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 55% మార్కులు సరిపోతాయి. వీటితో పాటు సంబంధిత రంగంలో అనుభవం అవసరం.
ఎగ్జిక్యూటివ్ పోస్టులు: పోస్టును బట్టి గ్రాడ్యుయేషన్, ఎంబీఏ , సీఏ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
వయస్సు: అప్లై చేసుకునే అభ్యర్థుల గరిష్ట వయసు 35 సంవత్సరాలుగా నిర్ణయించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు వయో సడలింపు ఉంటుంది.
జీతం:
ఎంపికైన అభ్యర్థులకు సంవత్సరానికి సుమారు రూ. 11,00,000 (CTC) వరకు జీతం లభిస్తుంది. దీనిలో హెచ్‌ఆర్ఏ, మెడిక్లెయిమ్, పెర్ఫార్మెన్స్ ఆధారిత వేరియబుల్ పే వంటి అదనపు సౌకర్యాలు ఉంటాయి.
ఎంపిక విధానం:
అభ్యర్థుల ఎంపిక కోసం కంపెనీ కంప్యూటర్-బేసిస్ట్ టెస్ట్ (CBT), గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ నిర్వహించే అవకాశం ఉంది.
అప్లికేషన్ విధానం:
1.అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్‌సైట్ www.ngel.in ఓపెన్ చేయాలి.
2.కెరీర్స్ సెక్షన్‌లోకి వెళ్లి సంబంధిత నోటిఫికేషన్‌ను చెక్ చేయాలి. అనంతరం మీ వివరాలతో లాగిన్ అవ్వండి.
3.జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులు రూ. 500 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.
4.ఆన్‌లైన్ అప్లికేషన్ పూర్తి చేసి, అవసరమైన సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేసి సబ్మిట్ చేయాలి. భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ కాపీని ప్రింట్ తీసుకోవడం మంచిది.

