Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఏపీ ఐసెట్-2026 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల

ఏపీ ఐసెట్-2026 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల

Merupulu 4 days ago

పీలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో.. అడ్మిషన్లు పొందాలనుకునే అభ్యర్థులకు గుడ్ న్యూస్. ఏపీ ఐసెట్-2026 ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ అధికారికంగా విడుదలైంది.

ఐసెట్‌లో అర్హత సాధించిన విద్యార్థులు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, సర్టిఫికేట్ల అప్‌లోడ్ ,ఫీజు చెల్లింపు ప్రక్రియను చివరి తేదీ లోగా పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆగస్టు 24 నుంచి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కానుండగా.. సెప్టెంబర్ 1 నుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్, ఆగస్టు 27 నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియలు జరుగుతాయి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

రిజిస్ట్రేషన్:
కౌన్సెలింగ్‌లో పాల్గొనాలనుకునే అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవడంతో పాటు, అవసరమైన సర్టిఫికేట్లను అప్‌లోడ్ చేసి ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ ఆగస్టు 24 నుంచి ఆగస్టు 31 వరకు అందుబాటులో ఉంటుంది. ఇందుకోసం అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికేట్లన్నింటినీ సిద్ధంగా ఉంచుకోవాలి.

ఆన్‌లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్:
అభ్యర్థులు అప్‌లోడ్ చేసిన డాక్యుమెంట్ వెరిఫికేషన్ అధికారులు ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 1 వరకు ఆన్‌లైన్ విధానంలో పరిశీలిస్తారు. ఒకవేళ ఏదైనా సమస్య ఉంటే.. విద్యార్థులకు తగిన సూచనలు అందించడం జరుగుతుంది.

వెబ్ ఆప్షన్లు:
అభ్యర్థులకు అత్యంత కీలకమైన వెబ్ ఆప్షన్ల ప్రక్రియ.. ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 2 వరకు నిర్వహించనున్నారు. తమకు నచ్చిన కాలేజీలు, కోర్సులను ప్రాధాన్యత క్రమంలో ఆన్‌లైన్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ నమోదు చేసిన ఆప్షన్లలో ఏవైనా మార్పులు చేసుకోవాలనుకుంటే.. సెప్టెంబర్ 3న ఒక రోజు ఎడిట్ ఆప్షన్ కల్పిస్తారు.

సీట్ల కేటాయింపు, రిపోర్టింగ్:
అభ్యర్థులు పెట్టిన వెబ్ ఆప్షన్ల ఆధారంగా సీట్ల కేటాయింపు ఫలితాలను సెప్టెంబర్ 7న విడుదల చేయనున్నారు. సీట్లు పొందిన వారు సెప్టెంబర్ 8 నుంచి సెప్టెంబర్ 11వ తేదీ మధ్య సంబంధిత కాలేజీల్లో రిపోర్ట్ చేసి అడ్మిషన్ ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Merupulu