ఏపీలో మూడేళ్లు, ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ (LLB) కోర్సులతో పాటు ఎల్‌ఎల్‌ఎమ్ (LLM)లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ లాసెట్ (AP LAWCET), పీజీఎల్‌సెట్ (PGLCET) ఫలితాలు అధికారికంగా విడుదలయ్యాయి.
ఏపీ ఉన్నత విద్యామండలి (APSCHE) ఆదేశాల మేరకు అభ్యర్థుల ర్యాంక్ కార్డ్స్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. ఈ పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ వివరాలను ఎంటర్ చేసి, అధికారిక పోర్టల్ నుంచి ఫలితాలను, ర్యాంక్ కార్డ్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఏపీ లాసెట్ ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోండిలా :
రిజల్ట్స్ చెక్ చేసుకోవడానికి అభ్యర్థులు ఎలాంటి కన్‌ఫ్యూజన్ లేకుండా కింద ఇచ్చిన సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి.
స్టెప్ 1: మొదట ఏపీ లాసెట్ అధికారిక వెబ్‌సైట్ cets.apsche.ap.gov.in ఓపెన్ చేయండి.
స్టెప్ 2: హోమ్‌పేజీలో మీకు కనిపిస్తున్న 'AP LAWCET Results / Rank Card' అనే లింక్‌పై క్లిక్ చేయండి.
స్టెప్ 3: ఇప్పుడు కొత్త పేజీలో మీ లాసెట్ హాల్ టికెట్ నంబర్ (Registration/Hall Ticket No), పుట్టిన తేదీ (Date of Birth) ఎంటర్ చేయండి.
స్టెప్ 4: వివరాలన్నీ కరెక్ట్‌గా ఎంటర్ చేశాక, కింద ఉన్న 'View Result' లేదా 'Submit' బటన్‌పై క్లిక్ చేయండి.
స్టెప్ 5: అంతే.. మీ ర్యాంక్ కార్డ్ స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతుంది. మీ మార్కులు, ర్యాంక్‌ను చెక్ చేసుకుని, ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం ఒక ప్రింటవుట్ లేదా పీడీఎఫ్ (PDF) సేవ్ చేసుకోండి.

