Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఏపీ పాలిసెట్ ఫలితాలు విడుదల

ఏపీ పాలిసెట్ ఫలితాలు విడుదల

Merupulu 2 weeks ago

పీ పాలిసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర సాంకేతిక విద్యామండలి విడుదల చేసిన ఈ ఫలితాలు ఈ ఏడాది సరికొత్త రికార్డులు సృష్టించాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 91.37 శాతం ఉత్తీర్ణత నమోదైంది.

సాంకేతిక విద్యపై విద్యార్థుల్లో పెరుగుతున్న ఆసక్తికి ఈ ఫలితాలే నిదర్శనమని అధికారులు పేర్కొంటున్నారు.

విద్యార్థుల హాజరు,అర్హత వివరాలు:
ఈ ఏడాది పాలిసెట్ పరీక్ష కోసం రాష్ట్రవ్యాప్తంగా 1,77,581 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, ఏప్రిల్ 25న నిర్వహించిన పరీక్షకు 1,63,008 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో రికార్డు స్థాయిలో 1,48,930 మంది విద్యార్థులు పాలిటెక్నిక్ ప్రవేశాలకు అర్హత సాధించారు. గత కొన్నేళ్లుగా పాలిసెట్ చరిత్రలో ఇంత భారీ స్థాయిలో అభ్యర్థులు పరీక్షకు హాజరుకావడం, ఉత్తీర్ణత సాధించడం ఇదే మొదటిసారి.

మరోసారి సత్తా చాటిన అమ్మాయిలు:
ప్రతి ఏడాదిలాగే ఈ సారి కూడా ఫలితాల్లో అమ్మాయిలదే పైచేయిగా నిలిచింది. అబ్బాయిలతో పోలిస్తే.. అమ్మాయిలు మెరుగైన ఫలితాలను సాధించారు. బాలికల ఉత్తీర్ణత శాతం 93.57% గా నమోదైంది.

మెరిసిన మన్యం:
ఈ ఏడాది ఫలితాల్లో అందరినీ ఆశ్చర్యపరిచిన అంశం మన్యం జిల్లాలు, ఏజెన్సీ ప్రాంతాల విద్యార్థుల ప్రతిభ. మారుమూల గిరిజన ప్రాంతాల విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ ఉత్తీర్ణత శాతాన్ని సాధించి మొదటి స్థానాల్లో నిలిచారు. ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో నాణ్యమైన శిక్షణ, మౌలిక వసతుల కల్పన కారణంగానే, ఎలాంటి వసతులు లేని ప్రాంతాల నుంచి కూడా విద్యార్థులు ఉన్నత విద్య వైపు అడుగులు వేస్తున్నారని ఈ ఫలితాలు నిరూపించాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Merupulu