ఏపీ టెన్త్ ఫలితాలు విడుదలయ్యాయి. విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ రిజల్ట్ ప్రకటించారు. ఈ ఏడాది మొత్తం 85.25 శాతం మంది విద్యార్ధులు ఉత్తీర్ణత సాధించారు.
కాగా..ఈ సారి టెన్త్ ఫలితాల్లో బాలికలదే పైచేయి. విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్ సైట్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. అలాగే వాట్సాప్ ద్వారా కూడా రిజల్ట్ తెలుసుకోవచ్చు. ఇందుకోసం..మన మిత్ర వాట్సాప్ ద్వారా కూడా ఫలితాలను పొందవచ్చు. 9552300009 నెంబర్ కు Hi అని మెసేజ్ చేసి అక్కడ వచ్చే ఆప్షన్షలో eduction services ఎంచుకుని ఆ తర్వాత SSC RESULTS సెలక్ట్ చేసి రోల్ నంబర్ ఎంటర్ చేస్తే.. రిజల్ట్స్ వస్తాయి.
అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్:
టెన్త్ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌ను ప్రభుత్వ విభాగం విడుదల చేసింది. జూన్ 5 నుంచి 12వ తేదీ వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. ఉదయం 9.30 నుంచి 12.30 వరకు ఎగ్జామ్స్ నిర్వహిస్తామని అధికారులు వెల్లడించారు.

