Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఏపీ యూనివర్సిటీల్లో 1,523 ప్రొఫెసర్, లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

ఏపీ యూనివర్సిటీల్లో 1,523 ప్రొఫెసర్, లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

Merupulu 1 week ago

పీ నిరుద్యోగులు, విద్యావంతులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఉన్నత విద్యా రంగాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 18 ప్రభుత్వ యూనివర్సిటీలతో పాటు రాజీవ్ గాంధీ నాలెడ్జ్ టెక్నాలజీస్ (RGUKT) లో ఖాళీగా ఉన్న 1,523 టీచింగ్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి ఉన్నత విద్యాశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది.

కాగా మే 18 నుంచి ఆన్‌లైన్ అప్లికేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. అభ్యర్థులు జూన్ 8 వరకు అప్లై చేసుకోవచ్చు. ఈ మెగా రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన పూర్తి వివరాలు, ఎంపిక విధానం ఇప్పుడు తెలుసుకుందాం.

ఏపీ వర్సిటీల్లో ఫ్యాకల్టీ ఉద్యోగాలు- పూర్తి వివరాలు:

పోస్టుల వివరాలు:
మొత్తం 1,523 పోస్టులలో 1,244 రెగ్యులర్ ఖాళీలు కాగా, మిగిలిన 279 బ్యాక్‌లాగ్ ఖాళీలు (SC, ST, BC కేటగిరీలకు కేటాయించినవి) ఉన్నాయి. వీటిలో ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ లైబ్రేరియన్లు, లెక్చరర్ పోస్టులు ఉన్నాయి.

ఏ వర్సిటీలో ఎన్ని ఖాళీలు?
రాజీవ్ గాంధీ నాలెడ్జ్ టెక్నాలజీస్ (RGUKT):
311 పోస్టులు (అత్యధికం)

ఆంధ్రా యూనివర్సిటీ (AU): 246 పోస్టులు

శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ (SVU): 125 పోస్టులు

శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీ (SKU): 103 పోస్టులు

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (ANU): 82 పోస్టులు

మొదటిసారి 'సింగిల్ కామన్ రిక్రూట్‌మెంట్ పోర్టల్':
అభ్యర్థుల సౌకర్యార్థం రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా ఒకే ఒక ఉమ్మడి పోర్టల్‌ను (Common Recruitment Portal) ప్రవేశపెట్టింది. దీని ద్వారా అభ్యర్థులు ఒకే అప్లికేషన్‌తో వివిధ విశ్వవిద్యాలయాలకు అప్లై చేసుకోవచ్చు.

ముఖ్యమైన తేదీలు:
ఆన్‌లైన్ అప్లికేషన్ల ప్రారంభం: మే 18 వ తేదీ నుంచి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

చివరి తేదీ: జూన్ 8వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.

వయోపరిమితి:
కనీస వయస్సు:
అభ్యర్థులు 18 సంవత్సరాలు నిండి ఉండాలి.

గరిష్ట వయస్సు: అసిస్టెంట్ ప్రొఫెసర్ / లెక్చరర్ పోస్టులకు సాధారణంగా 42 సంవత్సరాలు (జనరల్ కేటగిరీకి). ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు గరిష్ట వయోపరిమితి నిబంధనల నుంచి మినహాయింపు ఉంటుంది లేదా ఎక్కువగా ఉంటుంది.

వయోపరిమితి సడలింపు :

BC, SC, ST అభ్యర్థులకు: 5 సంవత్సరాల సడలింపు ఉంటుంది (అంటే 47 ఏళ్ల వరకు అప్లై చేయవచ్చు).

దివ్యాంగులకు (PH): 10 సంవత్సరాల సడలింపు వర్తిస్తుంది.

జీతం వివరాలు :
యూనివర్సిటీలలో అధ్యాపక ఉద్యోగాలకు కేంద్ర ప్రభుత్వ UGC 7వ వేతన సంఘం (7th CPC Pay Matrix) స్కేల్స్ ప్రకారం జీతాలు ఉంటాయి. బేసిక్ పేతో పాటు DA, HRA, ఇతర అలవెన్సులు కలుపుకుని జీతం లభిస్తుంది.

ఎంపిక విధానం :
ఈ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ పారదర్శకంగా జరగనుంది. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు సంబంధించి ఒక పోస్టుకు 12 మంది కంటే ఎక్కువ మంది అప్లై చేసుకుంటే APPSC ద్వారా స్క్రీనింగ్ టెస్ట్ (రాత పరీక్ష) నిర్వహిస్తారు. ఫైనల్ సెలక్షన్ అనేది రాత పరీక్ష, అకడమిక్/రీసెర్చ్ క్రెడెన్షియల్స్, ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది.

కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న అధ్యాపకులకు వారి సర్వీస్ ఆధారంగా అదనపు వెయిటేజీ మార్కులు ఇవ్వనున్నారు. అలాగే మహిళలు, దివ్యాంగులు, మాజీ సైనికులు, క్రీడాకారులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్లు వర్తిస్తాయి.

మరిన్ని వివరాలకు అధికారిక వెబ్ సైట్ apuniversitiesrecruitment.apcfss.in సంప్రదించవచ్చు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Merupulu