Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఎస్బీఐ పీవో ఉద్యోగాలకు ఈరోజే లాస్ట్ డేట్.. వెంటనే అప్లై చేయండి

ఎస్బీఐ పీవో ఉద్యోగాలకు ఈరోజే లాస్ట్ డేట్.. వెంటనే అప్లై చేయండి

Merupulu 2 weeks ago

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)లో ప్రొబేషనరీ ఆఫీసర్ (PO)పోస్టుల భర్తీకి గతంలో నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా 1500 ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు.

ఇదిలా ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి నేడే చివరి తేదీ. డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు. అభ్యర్థుల వయస్సు 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఖాళీల వివరాలు:
మొత్తం 1500 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఇందులో రెగ్యులర్ పోస్టులు 1046 కాగా, బ్యాక్‌లాగ్ పోస్టులు 54 ఉన్నాయి. కేటగిరీల వారీగా చూస్తే..

జనరల్ (UR): 588, OBC: 390, SC: 234, ST: 144, EWS: 114.

అర్హతలు:
ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేసిన వారు ఈ ఉద్యోగాలకు అర్హులు. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న వారు కూడా అప్లై చేయవచ్చు, కానీ నిర్దిష్ట తేదీ లోపు సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.

వయస్సు:

అభ్యర్థుల వయస్సు 01-04-2026 నాటికి 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. (SC/STలకు 5 ఏళ్లు, OBCలకు 3 ఏళ్లు వయోసడలింపు ఉంటుంది).

జీతం:

ప్రారంభ బేసిక్ పే రూ.48,480 తో పాటు ఇతర అలవెన్సులు కూడా ఉంటాయి.

ఎంపిక విధానం:
ఎస్బీఐ పీఓ ఎంపిక ప్రక్రియ మూడు దశల్లో జరుగుతుంది.

ఫేజ్-1 (ప్రిలిమ్స్): ఆగస్టులో జరుగుతుంది. ఇది 100 మార్కులకు (ఇంగ్లీష్-40, ఆప్టిట్యూడ్-30, రీజనింగ్-30) ఆబ్జెక్టివ్ టైప్‌లో ఉంటుంది. టైమ్ 30 నిమిషాలు.

ఫేజ్-2 (మెయిన్స్): సెప్టెంబర్‌ లో మెయిన్స్ పరీక్ష జరుగుతుంది. ఆబ్జెక్టివ్ (200 మార్కులు), డిస్క్రిప్టివ్ టెస్ట్ (50 మార్కులు) ఉంటాయి. ఇందులో రీజనింగ్, డేటా అనాలసిస్, జనరల్ అవేర్‌నెస్, ఇంగ్లీష్‌లపై టెస్ట్ ఉంటుంది.

ఫేజ్-3 (ఫైనల్): అక్టోబర్/నవంబర్ లో సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ ఎక్సర్‌సైజ్ , ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

ఫీజు వివరాలు:
జనరల్/ఈడబ్ల్యూఎస్/ఓబీసీ అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు రూ.750 కాగా,ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులకు ఎలాంటి ఫీజు లేదు.

అప్లికేషన్:
అభ్యర్థులు ఎస్బీఐ అధికారిక వెబ్‌సైట్ sbi.bank.in ద్వారా ఆన్‌లైన్‌లో మాత్రమే అప్లై చేయాలి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Merupulu