Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఇండియన్ ఆర్మీలో భారీగా ఉద్యోగాలు.. టెన్త్,ఇంటర్ అర్హతతో 2615 పోస్టుల భర్తీ!

ఇండియన్ ఆర్మీలో భారీగా ఉద్యోగాలు.. టెన్త్,ఇంటర్ అర్హతతో 2615 పోస్టుల భర్తీ!

Merupulu 2 days ago

ఇండియన్ ఆర్మీ రక్షణ శాఖ ఆధ్వర్యంలోని ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ (AOC) నుంచి 2615 సివిలియన్ గ్రూప్-సి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయింది.

టెన్త్, ఇంటర్, డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు ట్రేడ్స్‌మెన్ మేట్, ఫైర్‌మ్యాన్, ఎమ్‌టీఎస్, జేఓఏ, మెటీరియల్ అసిస్టెంట్ వంటి పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఆగస్టు 24 నుంచిఈ పోస్టులకు అప్లికేషన్లు ప్రారంభం అవుతాయి. అయితే సెప్టెంబర్ 22 వరకు ఆన్‌లైన్ అప్లికేషన్లు అందుబాటులో ఉంటాయి. ఎంపికైన వారికి 7వ వేతన సంఘం ప్రకారం రూ.18,000 నుంచి రూ.92,300 వరకు జీతం లభిస్తుంది. రాత పరీక్ష, ఫిజికల్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

పోస్టుల వివరాలు, ఖాళీలు:
ట్రేడ్స్‌మెన్ మేట్ :
1799 పోస్టులు (అర్హత: టెన్త్)

ఫైర్‌మ్యాన్ : 508 పోస్టులు (అర్హత: టెన్త్)

మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS): 142 పోస్టులు (అర్హత: టెన్త్)

జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ (JOA): 104 పోస్టులు (అర్హత: ఇంటర్ + ఇంగ్లీష్ టైపింగ్ నైపుణ్యం)

మెటీరియల్ అసిస్టెంట్: 50 పోస్టులు (అర్హత: డిగ్రీ)

ముఖ్యమైన తేదీలు:
ఆన్‌లైన్ అప్లికేషన్లు ప్రారంభ తేదీ:
ఆగస్టు 24 నుంచి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

చివరి తేదీ: సెప్టెంబర్ 22వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.

రాత పరీక్ష : నవంబర్ లో పరీక్ష నిర్వహించనున్నారు.

జీతం వివరాలు:
ఎంపికైన అభ్యర్థులకు 7వ వేతన సంఘం ప్రకారం జీతం లభిస్తుంది. పోస్టును బట్టి వేతన స్థాయి రూ.18,000 నుంచి రూ.92,300 వరకు ఉంటుంది.

ఎంపిక ,అప్లికేషన్ విధానం:
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులకు ముందుగా రాత పరీక్ష ఉంటుంది. ఆ తర్వాత ఫిజికల్ టెస్ట్ (అర్హత ఉన్న పోస్టులకు), టైపింగ్ టెస్ట్ (JOA పోస్టులకు), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు. అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ aocrecruitment.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Merupulu